ఆ 9 రాష్ట్రాల్లో పౌరసత్వమిచ్చే అధికారం కలెక్టర్లకు!

-

భారత్ పొరుగు రాష్ట్రాలైన అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ల నుంచి వలస వచ్చే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం.. 9 రాష్ట్రాల పరిధిలోని 31 జిల్లాల కలెక్టర్లకు ఇచ్చింది. ఆ రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులకు కూడా ఈ అధికారాన్ని కల్పించింది.

దీని ప్రకారం గత ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి డిసెంబరు 31 వరకు తొమ్మిది నెలల కాలంలో మొత్తం 1,414 మంది విదేశీయులకు భారత పౌరసత్వం లభించింది. ఈ విషయాన్ని 2021-22 వార్షిక నివేదిక ద్వారా కేంద్ర హోం శాఖ వెల్లడించింది. భారత పౌరసత్వం పొందిన వీరందరూ అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లకు చెందిన ముస్లిమేతర మైనారిటీలు. వీరికి 2019లో తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ద్వారా కాకుండా 1955నాటి సిటిజెన్‌షిప్‌ యాక్ట్‌ ద్వారా పౌరసత్వం మంజూరు చేయడం విశేషం.

దేశాల నుంచి వలస వచ్చే ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే అధికారం ఉన్న రాష్ట్రాలు.. గుజరాత్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, హరియాణా, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, మహారాష్ట్ర. ఈ రాష్ట్రాల పరిధిలోని 31 జిల్లాల కలెక్టర్లకు, హోంశాఖ కార్యదర్శులకు 1955 చట్టానికి అనుగుణంగా పౌరసత్వ మంజూరు అధికారాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news