వ్యాపారం చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్..రూ.10 లక్షల వరకు లోన్..!

-

చాలా మంది వ్యాపారాలను చేసేందుకు ఇష్టపడుతూ వుంటారు. కానీ పెట్టుబడి గురించి చూసి ఆగిపోతారు. అయితే వ్యాపారాలు చేయాలనుకునే వారికి ఆర్ధికంగా సహాయం ఇస్తోంది. చిరు వ్యాపారులకు
లోన్స్ ని ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముద్ర యోజన స్కీమ్ ని తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక పూర్తి వివరాల లోకి వెళితే..

ఈ స్కీమ్ ద్వారా వ్యాపారులు రూ.10 లక్షల వరకు వ్యాపార రుణాలు పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే… శిశు, కిషోర్, తరుణ్ పేరుతో వేర్వేరు రకాల లోన్ ఆప్షన్స్ ముద్ర లో వున్నాయి. ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద లోన్ తీసుకుని ఈజీగా లోన్ పొందొచ్చు.

గరిష్టంగా రూ.10 లక్షల వరకు లోన్ తీసుకోచ్చు. శిశు కేటగిరీలో రూ.50,000, రూ.50,001 నుంచి రూ.5,00,000 వరకు కిషోర్ కేటగిరీలో, రూ.5,00,001 నుంచి రూ.10,00,000 వరకు తరుణ్ కేటగిరీలో లోన్ ఇస్తారు. 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లలోపు రుణాలు చెల్లించాలి. ఇలా వ్యాపారం స్టార్ట్ చేయాలంటే లోన్ తీసుకుని ఎవరైనా స్టార్ట్ చెయ్యచ్చు. పెట్టుబడి కోసం చింతించక్కర్లేదు. స్టేట్ బ్యాంక్ కూడా ఈ లోన్ ని ఇస్తోంది. మీరు ఈ లోన్ ని పొందాలని అనుకుంటే సమీపం లో వున్నా స్టేట్ బ్యాంక్ కి వెళ్లి లోన్ ని తీసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news