కరోనాతో సిఏఏ లేట్ అయింది అంతే: బిజెపి చీఫ్

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పౌరసత్వం (సవరణ) చట్టం (సిఎఎ) అమలు ఆలస్యం అయిందని, త్వరలోనే ఈ చట్టం అమలు చేస్తామని… భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సోమవారం ప్రకటించారు. సిఎఎ అమలుకు పార్టీ కట్టుబడి ఉందని జెపి నడ్డా అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఒక సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి జెపి నడ్డా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు.

“సిఎఎ విషయానికొస్తే, ఇది ఇప్పటికే పార్లమెంటులో ఆమోదించబడింది. మీ అందరికీ పౌరసత్వం (సవరణ) చట్టం ప్రయోజనాలు లభిస్తాయి. దీనికి మేము కట్టుబడి ఉన్నాము అని ఆయన అన్నారు. కరోనా వైరస్ కట్టడి అయిందని ఆయన చెప్పారు. సిఏఏ నిబంధనలను రూపొందిస్తున్నారని, త్వరలో దేశవ్యాప్తంగా సిఎఐ అమలు చేయనున్నట్లు చెప్పారు. దీనిపై విపక్షాలు మరోసారి మండిపడ్డాయి.