బెజవాడలో మరోసారి కాల్ మనీ కలకలం

-

విజయవాడలో కాల్ మనీ నాగులు పడగ విప్పుతున్నాయి. గతంలో కాల్ మనీ వేధింపులు భరించలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. అధిక వడ్డీలకు డబ్బును అప్పుగా ఇచ్చి.. ముక్కు పిండి వసూలు చేస్తున్న కాల్ మనీ నాగులపై పోలీసులు ఉక్కు పాదం మోపడంతో పరిస్థితి చక్కబడింది. మళ్లీ ఇప్పుడు అదే వ్యవహారం మొదలైంది. బెజవాడలోని అజిత్ సింగ్ నగర్ లో మహిళకు కాల్ మనీ వేధింపులు బెదిరింపులు వచ్చాయి. అదనంగా వడ్డీ చెల్లించలేదని మహిళపై దాడి చేసింది కాల్ మనీ ముఠా.

రెండు సంవత్సరాల క్రితం రమ్యశ్రీ అనే మహిళ వద్ద లక్ష రూపాయలు అప్పుగా తీసుకుంది హరిప్రియ అనే మహిళ. ఆ మొత్తం డబ్బు చెల్లించిన అదనంగా 10 లక్షల రూపాయలు చెల్లించాలని బెదిరింపులకు పాల్పడ్డారు. నగదు చెల్లించకుంటే వ్యభిచారం చేయాలని మహిళపై ఒత్తిడి చేసింది రమ్యశ్రీ. వ్యభిచారం చేయనని నిరాకరించడంతో తన అనుచరులతో కలిసి మహిళపై దాడి చేసింది రమ్యశ్రీ. దీంతో చుట్టుపక్కల వారు రావడంతో కాల్ మనీ ముఠా పరారయింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అజిత్ సింగ్ నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news