ఎలుకకు రిటైర్మెంట్ ఇచ్చారు.. ఎక్కడో తెలుసా?

-

కాంబోడియా: 2014 టాంజానియాలో జన్మించిన ఎలుకకు ‘మగవా’ అని పేరు పెట్టారు. ఈ ఎలుకకు బాంబులను వాసన ద్వారా గుర్తించే శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం ఈ ఎలుక 2016లో బాంబులను గుర్తించడం మొదలు పెట్టింది. అలా మొత్తం 71 ల్యాండ్ మైన్లను, 38 రకాల పేలుడు పదార్థాలను గుర్తించి ప్రజల ప్రాణాలను కాపాడింది. లక్షా 41 వేల చదరపు మీటర్ల దూరంలో ఉన్న బాంబులను కూడా ఈ ఎలుక గుర్తించగలదు. మొత్తం ఐదేళ్ల పాటు సేవలు చేసింది.

అలా ఈ మగువా (ఎలుక)కు చాలా రివార్డులు కూడా వచ్చాయి. గత సంవత్సరం బ్రిటీష్ చారిటీ గోల్డ్ మెడల్ ఇచ్చి ఎలుకను పురస్కరించింది. ఈ ఎలుక జన్మించి 8 ఏళ్లు అయింది. ప్రస్తుతం ఈ ఎలుకకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు ట్రైనింగ్ ఇచ్చిన ఏపీవోపీవో సంస్థ పేర్కొంది. ఈ సంస్థ డబ్బులు తీసుకోకుండా ఎలుకలు, కుందేళ్లు, కుక్కలకు శిక్షణ ఇస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news