బంగారం ధరలు (Gold Price) పెరిగాయి. దీనితో పసిడి ప్రియులకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ధరలు మరింత పెరుగుతాయి అని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ధరలు రూ.50వేల నుంచి రూ.60వేలకు పెరుగుతాయని అంటున్నారు. ఇక బంగారం ధరలు ఎలా వున్నాయి అనేది చూస్తే..
మార్చి 31న 22 క్యారెట్ల నగల బంగారం ధర రూ.41,100 ఉంది. కానీ ఇప్పుడు రూ.45,900 ఉంది. 66 రోజుల్లో ధర రూ.4,800 పెరిగింది. అదే 24 క్యారెట్ల నగల బంగారం ధర చూస్తే.. 10 గ్రాములు మార్చి 31న రూ.44,840 వుంది. కానీ ఇప్పుడు రూ.50,070 ఉంది.
అంటే 66 రోజుల్లో ధర రూ.5,230 పెరిగింది. గత 10 రోజుల్లో బంగారం ధర ఆరు సార్లు పెరిగింది. మూడు సార్లు తగ్గింది. కేవలం ఒక్క సారె స్థిరంగా వుంది. 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి 1 గ్రాము రూ.5,007 ఉంది.
నిన్న ధర రూ.43 పెరిగింది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.40,056 ఉంది. నిన్న తులం ధర రూ.344 పెరిగింది. ఇది ఇలా ఉంటే 10 గ్రాములు ధర రూ.50,070 ఉంది. నిన్న ధర రూ.430 పెరిగింది.