వేసవి లో ఎండలు ఎక్కువగా వుంటూ ఉంటాయి. నిజానికి ఆ వేడిని తట్టుకోవడం ఎంతో కష్టం. ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటుతూ ఉంటే చికాకు వచ్చేస్తూ ఉంటుంది. అందుకే అందరు ఏసీ గదుల్లోనే ఉండిపోతున్నారు. ఆర్ధిక స్థోమతను బట్టి ఏసీలు లేదా కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే అందరు అంత ధరని పెట్టలేరు.
ఈ నేపధ్యంలో కొన్ని పోర్టబుల్ ఏసీలు అందుబాటులోకి రావడం జరిగింది. మరి ఇక వాటి కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. అమెజాన్‌లో మినీ ఎయిర్ కండీషనర్‌లు చాలానే మనకి వున్నాయి. వీటిని మనం దాదాపు ఫ్యాన్ ధరలకే కొనుగోలు చేసేయచ్చు. అయితే వాటిలో ఒకటి LUCHILA Go Arctic ఎయిర్ కండీషనర్. అసలు ధర 4 వేల 499 రూపాయలు కాగా, ప్రస్తుతం డిస్కౌంట్‌తో కలిగి కేవలం 1899 రూపాయలకే వస్తోంది.
ఇది 3 ఇన్ 1 కండీషనర్. హ్యుడిడిఫైయర్ ప్యూరిఫైయర్ మిని కూలర్ అని కూడా దీనిని అంటారు. దీని బరువు కూడా బాగా తక్కువే. దీనిని మీరు సులభంగా తీసుకెళ్లవచ్చు. ఆన్‌లో ఉన్నప్పుడు ఎక్కువ సౌండ్ లేకుండా డిజైన్ చేయడం జరిగింది. ఇందులోని హైడ్రో చిల్ టెక్నాలజీ ఎవోపరేటివ్ ఎయిర్ కూలింగ్ ఫిల్టర్ ద్వారా వేడి గాలిని లోపలకు లాగి చల్లగా మార్చేస్తుంది. పెద్ద ఏసీల కంటే తక్కువ కరెంటు దీనికి ఖర్చు అవుతుంది.