వెల్లుల్లితో ఎంత ఆరోగ్యం ఉందో అందరికి తెలుసు..అందుకే, ఆయుర్వేదం లో కూడా ఎక్కువగా వీటిని ఉపయోగిస్తున్నారు.. అయితే తెల్ల వెల్లుల్లి కన్నా కూడా నల్ల వెల్లుల్లి తో ఇంకా మెరుగైన ఫలితాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నల్ల వెల్లుల్లిని ఎలా తీసుకోవాలి, ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
నల్ల వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. హృదయానికి సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టొచ్చు. బ్లడ్ సర్క్యులేషన్ కి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది..గ్యాస్ట్రో ఇంటెస్టినల్ హెల్త్ కి కూడా నల్లవెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది. అజీర్తి సమస్యల నుంచి ఇది బయటపడేస్తుంది. చూశారు కదా దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని మీ డైట్ లో తీసుకుంటే చాలా సమస్యలు దూరం అవుతాయి.
అలాగే ఇప్పుడు వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి.. దానివల్ల అలెర్జీలు రావడం సహజం..అలర్జీలను తొలగించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి..నల్ల వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అలాగే ఇంఫ్లమేషన్ మొదలైన సమస్యలను కూడా తొలగిస్తుంది. యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఇందులో ఉంటాయి.. అందుకే నెలలో రెండు సార్లు వీటిని తీసుకోవడం మేలు..