ఆన్‌లైన్‌ ద్వారా PPF, సుకన్య సమృద్ధి అకౌంట్లలో ఇలా డబ్బులని డిపాజిట్ చెయ్యచ్చు..!

-

ఈ మధ్య కాలం లో చాలా మంది నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. వీటిలో డబ్బులు పెట్టడం వలన మంచిగా డబ్బులు వస్తాయి. చాలా మంది ఇన్వెస్ట్ చేసే స్కీమ్స్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఒకటి. సుకన్య సమృద్ధి యోజన మరొకటి. బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ ఇవి. మంచిగా రాబడిని ఈ స్కీమ్స్ లో డబ్బులు పెట్టి పొందొచ్చు.

money
money

అయితే ఈ స్కీమ్స్ లో డబ్బులు పెట్టాలంటే పెద్ద కష్టపడక్కర్లేదు. ఈజీగా ఇంట్లో వుండే మనం డబ్బులు వెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇటీవల డక్‌పే డిజిటల్ పేమెంట్స్ యాప్‌ను తీసుకువచ్చింది.

దీనితో ఈజీగా పీపీఎఫ్, సుకన్య సమృద్ధి స్కీమ్ వంటి వాటిల్లో ఆన్‌లైన్‌లోనే డబ్బులు డిపాజిట్ చేసే అవకాశం వుంది. దీని ద్వారా డబ్బులు పంపడం, స్కానింగ్ క్యూఆర్ కోడ్, మర్చంట్ చెల్లింపులు వంటి సేవలు కూడా పొందొచ్చు. ఇక ఎలా డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఐపీపీబీ అకౌంట్‌కు వెయ్యాలో చూద్దాం.

డీఓపీ ప్రొడక్ట్స్‌లోకి వెళ్లి సుకన్య సమృద్ధి అకౌంట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి.
నెక్స్ట్ మీరు మీ సుకన్య సమృద్ధి అకౌంట్ నెంబర్, డీఓపీ కస్టమర్ ఐడీ ని ఎంటర్ చెయ్యాల్సి వుంది.
మీ ఇన్‌స్టాల్‌మెంట్ డ్యూరేషన్, అమౌంట్ ఎంటర్ చేయాలి. ఫైనల్ గా పేమెంట్ సక్సెస్ నోటిఫికేషన్ వస్తుంది.

అదే మీరు పీపీఎఫ్ లో వేసుకోవాలంటే. వీటిల్లో మీరు పీపీఎఫ్ అకౌంట్ ఎంచుకోవాలి. ఆ తరవాత పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. డీఓపీ కస్టమర్ ఐడీ ఎంటర్ చేయాలి. ఎంత మొత్తం డిపాజిట్ చేస్తున్నారో ఎంటర్ చేయాలి. ఇప్పుడు పే ఆప్షన్‌పై క్లిక్ చెయ్యాలంతే. ఇలా ఈజీగా మీరు ఇంట్లో నుండే ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news