శునకాలు కరోనా వైరస్ ని గుర్తిస్తాయా…?

-

ఇప్పుడు కరోనా వైరస్ నేపధ్యంలో జనాలకు ఉన్న ప్రధాన భయం వాళ్లకు వైరస్ సోకిందో లేదో తెలియదు, కనీసం పక్కన వాళ్లకు ఉందా లేదా అనేది కూడా తెలియదు. పక్కని వాళ్లకు కరోనా ఉంటే జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. దాన్ని గుర్తించాలి అంటే కచ్చితంగా పరిక్షలు చెయ్యాల్సి ఉంటుంది. తాజాగా ఒక విషయం బయటకు వచ్చింది. కుక్కలకు కరోనా వైరస్ ని గుర్తించే సామర్ధ్యం ఉందని తెలిసి౦ది.

ఆ ఒక్క వైరస్ నే కాదు దాదాపు అన్ని రకాల వైరస్ లను అవి పసిగట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ముందు శాస్త్రవేత్తలు అసలు కుక్కలా ద్వారా వైరస్ ని గుర్తించవచ్చా లేదా అనే దాని మీద ఆలోచన రావడంతో శక్తివంతమైన వాసనను గుర్తించే గుణం ఉన్న శునకాలను ఎంపిక చేసి వాటికి శిక్షణ ఇవ్వాలి అనుకున్నారు.. అనుకున్న వెంటనే ఇచ్చేసారు. అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన వెటర్నరీ మెడిసిన్‌ విభాగం పరిశోధకులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

1980లలో శునకాలు వాసన చూడటం ద్వారా క్యాన్సర్‌ను గుర్తించిన దాఖలాలు ఉన్నాయని, చాలా కణాలు త్వరగా ఆవిరి అయ్యే సేంద్రియ సమ్మేళనాలు(వీవోసీ)లను కలిగి ఉంటాయని… మనుషుల రక్తం లాలా జాలం, మూత్రంలో ఈ కణాలు ఎక్కువగా ఉంటాయని… వాటి నుంచి వచ్చే వాసన ద్వారా కుక్కలు వైరస్ లను గుర్తిస్తాయని చెప్తున్నారు. ప్రస్తుతం నెగెటివ్‌, పాజిటివ్‌ నమూనాలను శునకాల ముందు ఉంచి వాసన చూపిస్తూ శిక్షణ ఇస్తున్నారు. జులై లో ఇవి సేవలు మొదలుపెడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news