వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారా..? ఈ స్కీమ్‌తో రూ.10 లక్షల లోన్..!

మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? అయితే మీకో శుభవార్త. వ్యాపారాలు చేయాలనుకునే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారితో పాటుగా మహిళలకి కూడా లోన్ ని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం స్టాండప్ ఇండియా పథకాన్ని ప్రారంభించింది. 2006లో ఈ స్కీమ్ ని కేంద్రం ప్రారంభించింది.

money
money

అప్పటి నుండి మార్చి 21 వరకూ లక్ష కి పైగా లోన్స్ ని అందించింది. 2016 ఏప్రిల్ 5న ఈ స్కీమ్ ను ప్రారంభించారు. వ్యాపారంలని ప్రోత్సహించాలనే సంకల్పంతో ఈ పథకాన్ని తీసుకు రావడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళు మరియు మహిళలు ఈ స్కీమ్ ద్వారా 10 లక్షల రూపాయల నుండి కోటి వరకు లోన్ తీసుకోవచ్చు.

బ్యాంకు కి ఒక్కరైనా సరే ఈ పథకం కింద లోన్ తీసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సేవా రంగాలు, తయారీ రంగం, వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు చేసేవారు ఈ లోన్ ని తీసుకోవచ్చు. ఇక ఈ లోన్ కి ఎవరు అర్హులు అనేది చూస్తే…

18 ఏళ్లు దాటిన వాళ్ళు ఈ లోన్ ని తీసుకో వచ్చు. వ్యాపారం లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు మహిళలకు కనీసం 51% షేర్ హోల్డింగ్ ఉండాలి. గతం లో లోన్ తీసుకుని వాయిదాలు చెల్లించక పోయినట్లయితే ఈ లోన్ ఇవ్వరు. ఇక లోన్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి కూడా చూసేద్దాం. ఇండియా పోర్టల్ https://www.standupmitra.in/ ద్వారా అప్లై చేయొచ్చు. లేదా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్‌కు లోన్ దరఖాస్తు పంపొచ్చు.

ముందుగా https://www.standupmitra.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో అప్లై హియర్ పైన క్లిక్ చేయాలి.
నెక్స్ట్ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
New Entrepreneur, Existing Entrepreneur, Self Employed Professional ఆప్షన్స్‌లో మీకు సూటయ్యే ఆప్షన్ ఎంచుకోవాలి.
పేరు, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చెయ్యాలి. ఓటీపీ జనరేట్ చేయాలి.
ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ ఫామ్ పూర్తి చేయాలి.
లోన్ వివరాలు ఎంటర్ చేయాలి.
తరవాత అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి లోన్ కోసం దరఖాస్తు చేయాలి.