తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. హైకోర్టు ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ పర్యటనపై మంత్రి కేటీఆర్ సెటైర్లు పేల్చారు.
స్టడీ టూర్‌కు వస్తున్న రాహుల్ గాంధీకి స్వాగతం, తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు రాహుల్ తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడి పథకాలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని మంత్రి కేటీఆర్ చురకలు అంటించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ట్వీట్ చేశారు.
అటు రాహుల్ గాంధీ పర్యటన పై ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. గౌరవ రాహుల్ గాంధీ గారు, మీరు కానీ మీ పార్టీ కానీ ఎన్ని సార్లు పార్లమెంట్ లో తెలంగాణ అంశాలను, హక్కులను ప్రస్తావించారో చెప్పండి.? తెలంగాణ రాష్ట్ర హక్కులకోసం టిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు ? అని నిలదీశారు. దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
We welcome Rahul Gandhi to a study tour, let him learn the best farmer friendly practices of Telangana & implement in congress ruled failed states: KTR – The Hindu https://t.co/TUKANCbKbO
— KTR (@KTRTRS) May 6, 2022