ఎల్ఐసీ ఎన్నో రకాల పాలసీలని అందిస్తోంది. ఈ పాలసీల ద్వారా ఎన్నో రకాల బెనిఫిట్స్ ని పొందొచ్చు. ఈ పాలసీ వలన చాలా మందికి ప్రయోజనము ఉంటుంది. ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. ఈ పాలసీల యాన్యుటీ రూపం లో మీరు ఈ బెనిఫిట్ సొంతం చేసుకోవచ్చు. డిపాజిట్ చేసే మొత్తం ప్రాతిపదికన మీకు వచ్చే రాబడి కూడా ఆధార పడి ఉంటుంది. ఒక్క సారి ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఎల్ఐసీ తీసుకు వచ్చిన పాలసీల్లో న్యూ జీవన్ శాంతి పాలసీ కూడా ఒకటి. ఈ స్కీమ్ లో చేరడం వల్ల రెగ్యులర్‌గా ప్రతి నెలా మీరు డబ్బులు ని పొందొచ్చు. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. బీమా కవరేజ్ కూడా లభిస్తుంది.
యాన్యుటీ ఆప్షన్లు కూడా ఇందులో వున్నాయి. మీరు మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసేయచ్చు. ఏడాది నుంచి 12 ఏళ్ల వరకు యాన్యుటీ డిఫర్డ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. పాలసీ తీసుకున్న తరవాత ఎప్పటి నుంచి డబ్బులు పొందాలి అనే అప్షన్‌ను మీరు ఎంచుకోవచ్చు. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున మీకు లభించే యాన్యుటీ మొత్తాన్ని పొందవచ్చు. ఒకవేళ కనుక మీరు నెల ఆప్షన్ ఎంచుకుంటే ప్రతి నెలా మీకు ఆ డబ్బులు వస్తాయి. లేదంటే ఏడాది ఆప్షన్ అయితే ఏడాదికి ఒకసారి డబ్బులు చెల్లిస్తారు. రూ. 1.5 లక్షలు చెల్లించి ఈ పాలసీని పొందొచ్చు. గరిష్ట పరిమితి ఏమీ లేదు.
ఎంత మొత్తానికి అయినా ఈ పాలసీని తీసుకోవచ్చు. అలానే డిఫర్డ్ యాన్యుటీలో కూడా మళ్లీ రెండు ఆప్షన్లు ఉంటాయి. సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్. ఒక్కసారి ఒక ఆప్షన్ ఎంచుకుంటే తర్వాత దాన్ని మార్చుకోవడం అవ్వదు. 35 ఏళ్ల వయసులో ఉన్న వారు ఎల్ఐసీ జీవన్ శాంతి పాలసీ ని తీసుకుంటే రూ. 10 లక్షలు పెట్టి పాలసీ కొనుగోలు చేస్తే… సింగిల్ లైఫ్ ఆప్షన్ ని ఎంచుకుంటే… డిఫర్‌మెంట్ పీరియడ్ 10 ఏళ్లు. వీరికి ఏటా రూ. 1.2 లక్షలు వస్తాయి. అదే ఒకవేళ ఏడాది ఆప్షన్ ఎంచుకుంటే ఈ డబ్బులని ఏటా పొందొచ్చు. రూ. 10 లక్షలకు కాకుండా రూ. 25 లక్షలకు పాలసీ తీసుకుంటే రూ. 3 లక్షలకు పైగా వస్తాయి. నెలకు రూ.25 వేలు ని మీరు తీసుకోవచ్చు. పాలసీ దారుడు మరణిస్తే నామినీకి ఈ డబ్బులు వస్తాయి. 30 నుంచి 70 ఏళ్ల వరకు వయసు వారు పాలసీ కొనొచ్చు.