కేంద్రం చాలా రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన మనకి ఎన్నో లాభాలు కలుగుతున్నాయి. అయితే కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో సుకన్య సమృద్ధి యోజన పథకం కూడా ఒకటి. ఈ స్కీమ్ వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. 7.6 శాతం వడ్డీని లబ్ధిదారులు అందుకోవచ్చు. ఆడపిల్లల తల్లిదండ్రులు వారి భవిష్యత్తు కోసం చింతించాల్సిన పని లేదు.
మీ దగ్గరిలో ఉన్న ఏ బ్యాంకు నుంచైనా ఈ సమృద్ధి యోజన అకౌంట్‌ను తెరవవచ్చు. లేదంటే పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి కూడా సమృద్ధి యోజన అకౌంట్‌ను తెరవవచ్చు. 10 ఏళ్ల లోపు ఆడపిల్లల పేరు మీద ఈ ఖాతా ఓపెన్ చెయ్యచ్చు. అప్పుడు ఆమె వయస్సు 18 ఏళ్లు వచ్చిన తరువాత అకౌంట్ హోల్డర్లుగా మారుతారు. ఓసారి ఈ ఖాతా ని తెరిచాక 15 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు ఇందులో డబ్బులని పెడుతూ వెళ్ళాలి.
ఆడపిల్లకు 21 ఏళ్లు పుర్తయితే అప్పుడు మెచ్యురిటీలోకి వస్తుంది. ప్రతీ సంవత్సరం కనీసం రూ.250 డిపాజిట్ చేయవలసి వుంది. మీరు దీనిలో రూ.250 నుంచి రూ.1.5 లక్షల వరకు ఎంతైనా కట్టచ్చు. కానీ ఏడాదికి కచ్చితంగా రూ.250 డిపాజిట్ చెయ్యాల్సి వుంది. ప్రతీ సంవత్సరం ఆ సంవత్సర ఆర్ధిక సంవత్సరము ఆఖరున ఈ వడ్డీ ని అకౌంట్ లో వేస్తారు. ప్రభుత్వం 7.6 శాతం వడ్డీ ని ఈ స్కీమ్ కింద ఇస్తోంది. ఈ స్కీమ్ కింద నెలకు రూ.1,000 జమ చేస్తే రూ.5,27,445 రిటర్న్స్ పొందొచ్చు.