అదిరే LIC పాలసీ..రూ.29 పొదుపుతో రూ.లక్షలు..!

-

దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీల్లో ఒకటైన ఎల్ఐసీ ఎన్నో సేవలను అందిస్తోంది. దీని వలన ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అయితే ఎల్ఐసీ అందించే పాలసీల్లో కొన్ని స్పెషల్ పాలసీలు కూడా వున్నాయి. వాటిలో ఆధార్ శిలా కూడా ఒకటి. ఈ పాలసీ ద్వారా అదిరే లాభాలను మనం పొందొచ్చు. మహిళల కోసం స్పెషల్ గా ఈ పాలసీని తీసుకు రావడం జరిగింది.

LIC
LIC

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఆధార్ కార్డు కలిగిన మహిళలు ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. దీనిని తీసుకోవడం వలన ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది. మహిళలు ఈ పాలసీ తీసుకుంటే.. రోజుకు రూ.29 పొదుపుతో మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ. 4 లక్షలు వస్తాయి. లోన్ ఫెసిలిటీ కూడా ఉంది.

ఈ పాలసీకి ఎవరు అర్హులు అనేది చూస్తే.. 8 నుంచి 55 ఏళ్ల మధ్యలో వయసు కలిగిన వారు దీనికి అర్హులు. పదేళ్ల నుంచి 20 ఏళ్ల వరకు కాల పరిమితితో ఆధార్ శిలా పాలసీని పొందొచ్చు. మెచ్యూరిటీ సమయంలో 70 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇక ఎంత వరకు డబ్బులు పెట్టచ్చు అనేది చూస్తే.. రూ.75 వేల కనీస బీమా మొత్తంతో ఈ పాలసీ పొందొచ్చు. మాక్సిమం అయితే రూ.3 లక్షల వరకు బీమా మొత్తానికి పాలసీ పొందొచ్చు.

నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున ప్రీమియం డబ్బులను కట్టచ్చు. ప్రీమియం డబ్బులు, డెత్ క్లెయిమ్‌పై ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా. ఇక ఎలా డబ్బులొస్తాయి అనేది చూస్తే.. 20 ఏళ్ల వయసులో ఉన్న వారు 20 ఏళ్ల కాల పరిమితితో రూ. 3 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే.. వార్షిక ప్రీమియం రూ.10,800 ఉంటుంది. ప్రతి రోజు మీరు కేవలం రూ.29 పొదుపు చేస్తే చాలు. మెచ్యూరిటీ సమయంలో రూ. 4 లక్షల వరకు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news