ట్రిపుల్ ఆర్ క‌లెక్ష‌న్లు ఇవే..

-

అంతా అనుకున్న‌ది వేరు
ఇప్పుడు జ‌రుగుతున్న‌ది వేరు
టాక్ ఎలా ఉన్నా క‌లెక్ష‌న్ల సౌండ్ అదిరిపోతుంది
ఓ విధంగా గ‌తంలో నెల‌కొన్న రికార్డుల‌న్నింటినీ
తొక్కుకుంటూ పోతుంది.. ఓ విధంగా ఇది వేట
వ‌సూళ్ల వేట మొదల‌యింది ఇప్పుడే ఇక ఆగ‌దు
ఆగే వీల్లేదు కూడా! దటీజ్ ట్రిపుల్ ఆర్

ట్రిపుల్ ఆర్ సినిమా మంచి విజ‌యం సాధించింది.అనుకున్న దాని క‌న్నా ఎక్కువ‌గానే ఫ‌లితాలు అందుకుంది. ముఖ్యంగా యూఎస్ లో క‌లెక్ష‌న్లు చాలా బాగున్నాయి. దీంతో టీం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది.ఈ ఆనందంలోనే ఎన్టీఆర్ నిన్న‌టి వేళ ఒక లేఖ రాశారు. రాం చ‌ర‌ణ్ లేనిదే ఆయ‌న అల్లూరి పాత్ర‌ను పోషించ‌నిదే తాను ఈ సినిమాను ఊహించ‌లేన‌ని అన్నారు. త‌న‌లోని న‌ట‌నా ప్ర‌తిభ‌ను ప‌రిపూర్ణ స్థాయిలో వినియోగించుకుని, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకునేలా చేసిన ద‌ర్శ‌క ధీర రాజ‌మౌళికి ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న రిజ‌ల్ట్ ప్ర‌కారం నాలుగు రోజుల క‌లెక్షన్ ఐదు వంద‌ల కోట్ల రూపాయ‌లు దాటేసింది.నిన్న‌టి వేళ బాహుబ‌లి2ని మించి క‌లెక్ష‌న్లు అందుకుంది.

నాలుగో రోజు క‌లెక్ష‌న్ 14 కోట్ల‌కు పైగా వ‌సూలు చేస్తే, ఈ సినిమా 17కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.ఇరు తెలుగు రాష్ట్రాల‌కూ సంబంధించి క‌లెక్ష‌న్ డేటా ఇది. రెండు ప్రాంతాల నుంచి వ‌చ్చిన క‌లెక్ష‌న్ క‌లిపి చూస్తే నిజంగానే ఆశ్చ‌ర్య‌పోవ‌డం సినీ అభిమానుల వంతు. వాస్త‌వానికి సినిమా విడుద‌లై నాల్గో రోజు అయిన సోమ‌వారం క‌లెక్ష‌న్లు డ్రాప్ అవుతాయ‌ని చాలా మంది అనుకున్నారు కానీ అవేవీ జ‌ర‌గ‌ని మాట‌లు అని తేలిపోయింది.

ఏరియాలవారీగా 4 రోజుల కలెక్షన్స్ వివరాలు..
నైజాం: 61.65
సీడెడ్: 31.82
ఉత్తరాంధ్ర: 17.81
ఈస్ట్ గోదావరి: 9.67
వెస్ట్ గోదావరి: 8.65
గుంటూరు: 12.67
కృష్ణా: 9.30
నెల్లూరు: 5.43
ఏపీ+తెలంగాణ: రూ. 157.00 కోట్లు
కర్ణాటక: 22.30
తమిళనాడు: 18.90
కేరళ: 5.35
హిందీ: 45.50
రెస్టాఫ్ ఇండియా: 4.20
ఓవర్సీస్: 63.80
టోటల్ వరల్డ్‌వైడ్: రూ. 317.05 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news