ఈ సారి అలా జరగబోదంటున్న నెల్సన్.. రజనీ 169వ సినిమా ప్లానింగ్ షురూ..

-

తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేనక్కర్లేదు. స్టైల్ కే స్టైల్ నేర్పిన హీరోగా ఆయనకు పేరుంది. ఇక ఆయన నటించిన ఫిల్మ్ రిలీజ్ అవుతుందంటే చాలు.. అభిమానులు పండుగ చేసుకుంటారు. తమిళనాట ఆయన్ని ఓ దేవుడిలా ఆరాధిస్తుంటారు. అయితే, రజనీకాంత్ గత చిత్రం ‘అన్నాత్తే’ అనుకున్న స్థాయిలో ఆడలేదు. తెలుగులో ఈ ఫిల్మ్ ‘పెద్దన్న’ పేరిట విడుదల కాగా, ఇక్కడ కూడా అంత రెస్పాన్స్ రాలేదు. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ ఫిల్మ్ పైన కాన్సంట్రేట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రజనీకాంత్ నెక్స్ట్ ఫిల్మ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది కూడా. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తు్న్నారు. ఇది తలైవాకు 169వ సినిమా. కాగా, ఈ చిత్రం ఎట్టి పరిస్థితులలోనూ ఆడియెన్స్ ను మెప్పించే విధంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. నెల్సన్ దిలీప్ కుమార్ ప్రస్తుతం ‘బీస్ట్’ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇళయ దళపతి విజయ్ తో ‘బీస్ట్’ చిత్రం తీసిన నెల్సన్ దిలీప్ కుమార్.. తర్వాత రజనీకాంత్ ఫిల్మ్ పైన ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు.

‘బీస్ట్’ చిత్రం వచ్చే నెల 13న విడుదల కానుంది. కాగా, ఈ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత కొద్ది రోజులకు రజనీ 169వ చిత్రంపైన నెల్సన్ వర్క్ చేయనున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ గ్యాంగ్ స్టర్ రోల్ ప్లే చేయబోతున్నట్లు కోలీవుడ్ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇకపోతే ఇందులో హీరోయిన్‌గా ఐశ్వర్యారాయ్ పేరు వినబడుతోంది. క్యూట్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ ను కూడా తీసుకుంటారని తెలుస్తోంది. త్వరలో ఈ చిత్ర టైటిల్, నటీ నటుల పూర్తి వివరాలు తెలిపే అవకాశాలున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news