రూ. 74 పెట్టుబడి పెడితే చాలు..కోటి వస్తాయి..!

-

ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. అయితే కేంద్రం తీసుకు వస్తున్నా ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వలన మంచిగా లాభం ఉంటుంది. పైగా ఆర్థిక బాధలన్నీ గట్టెక్కుతాయి కూడా. ఉద్యోగ విరమణ పొందిన తరువాత చేతికి ఎక్కువ డబ్బులు వస్తే హాయిగా ఏ టెన్షన్ లేకుండా జీవించచ్చు. నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో కూడా డబ్బులు పెట్టచ్చు.

దీనిలో మీరు ప్రతి రోజూ కేవలం రూ. 74 పెట్టుబడి పెడితే చక్కటి లాభాలని పొందొచ్చు. చిన్న వయస్సు లో డబ్బులు పెడితే ఎక్కువ మొత్తాన్ని పొందొచ్చు. దీనిలో ఇన్వెస్ట్ చేసేందుకు మీరు రోజూ 74 రూపాయలు ఆదా చేయడం మంచిది. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే మిలియనీర్ అయ్యిపోవచ్చు కూడా. ఇరవై ఏళ్ల వయస్సు వారు ప్రతి రోజూ 74 రూపాయలు అంటే నెలకు రూ. 2,230 ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చెయ్యాల్సి వుంది. 40 ఏళ్ల తరువాత అంటే 60 ఏళ్లకు రిటైర్ అయ్యాక మీ చేతికి కోటి రూపాయలు వస్తాయి.

9 శాతం రాబడితో రిటైర్ అయ్యాక రూ. 1.03 కోట్లు చేతికి వస్తాయి. బతికున్నంత కాలం నెల వారీగా పెన్షన్ కూడా వస్తుంది. 20 సంవత్సరాల వయస్సులో ఎన్‌పీఎస్‌లో నెలవారీగా రూ. 2230 పెట్టుబడి పెడితే 9 శాతం వడ్డీరేటుతో రాబడిని పొందొచ్చు. ఇందులో మీరు 40 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడిలో 60 శాతం డబ్బును మాత్రమే ఒకేసారి విత్‌డ్రా చేసేందుకు కుదురుతుంది. మిగిలిన 40 శాతం నెలవారీ పెన్షన్ పొందే యాన్యూటీ ప్లాన్‌లో పక్కా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మూలధనంలో 40 శాతం యాన్యూటీలో పెట్టుబడి పెడితే 60 ఏళ్ల వయసులో రూ. 61.86 లక్షలు చేతికి వస్తాయి. నెలకి రూ. 27,500 వరకు వస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news