స్టేట్ బ్యాంక్ సూపర్ స్కీమ్..రెగ్యులర్ గా రూ.10,000 ఆదాయం..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల స్కీమ్స్ ని కస్టమర్స్ కోసం తీసుకు వచ్చింది. యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ ని కూడా స్టేట్ బ్యాంక్ అందిస్తోంది. ఈ స్కీమ్‌లో డబ్బులు దాచుకోవడం ద్వారా ప్రతీ నెలా రూ.10,000 వరకు ఆదాయం వస్తుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

డబ్బులను ఎఫ్డి చేస్తే కేవలం వడ్డీ మాత్రమే వస్తుంది. అయితే రెగ్యులర్‌గా ఆదాయం కోరుకునేవారికి యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ బెస్ట్. ప్రతీ నెలా కూడా కచ్చితంగా ఇన్కమ్ వస్తుంది. పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ డబ్బులు వచ్చినవారు లేదా ఎక్కువ డబ్బులు వున్నప్పుడు ఇందులో డబ్బులు పెడితే మంచిది.

ప్రతీ నెలా ఆదాయం వస్తుంది. ఎవరైనా సరే ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ అకౌంట్ ని ఓపెన్ చెయ్యచ్చు. మైనర్లు, మేజర్లు ఎవరైనా దీనిలో చేరచ్చు. జాయింట్ అకౌంట్ అయినా సరే ఓపెన్ చెయ్యచ్చు. 36 నెలలు, 60 నెలలు, 84 నెలలు, 120 నెలలకు మీ డబ్బుల్ని డిపాజిట్ చేయొచ్చు. ఇందులో కనీసం రూ.25,000 పొదుపు చేయాలి. గరిష్ట పరిమితి ఏమి లేదు. కనీసం రూ.1,000 నుంచి ప్రతీ నెలా ఆదాయం లభిస్తుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వర్తించే వడ్డీ రేట్లే ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌కు కూడా వర్తిస్తాయి. మీరు నేరుగా స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి ఈ స్కీమ్ లో చేరచ్చు. యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో చేరేవారు నామినీ వివరాలు వెల్లడించాలి. అకౌంట్ హోల్డర్ మరణిస్తే డబ్బులు నామినీకి వస్తాయి. మీరు డిపాజిట్ చేసిన అమౌంట్‌పై లోన్ లేదా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవచ్చు. ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ ద్వారా ప్రతీ నెలా రూ.10,000 ఆదాయం పొందాలనుకుంటే రూ.5,07,964 జమ చేయాలి. రూ.10,000 చొప్పున అకౌంట్‌లో వెయ్యాలి.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news