ఈ కార్డు ఉంటే.. రూ.2 లక్షలు బెనిఫిట్.. ఈజీగా దరఖాస్తు చేయండిలా..!

-

ఇ-శ్రమ్ కార్డ్ వలన చాలా లాభాలు వున్నాయి. దేశంలోని అసంఘటిత రంగంలోని కార్మికులని ఏకతాటిపైకి తీసుకు వచ్చెనందుకే ఇ-శ్రమ్ కార్డ్ యోజనను తీసుకు రావడం జరిగింది. ఈ స్కీమ్ కింద చాలా మంది లాభాలని పొందుతున్నారు.

కార్మికులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు. 28.42 కోట్ల మంది ఇప్పటికే నమోదు చేసుకోవడం జరిగింది. మన దేశం లోని చిరువ్యాపారులు, కూరగాయలు అమ్మేవారు, ఇంటి పని చేసుకునే వారు మొదలు ఇలా చిన్న చిన్న పనులు చేసే యువకులందరూ ఈ-శ్రమ్ కార్డ్ యోజన లాభాలని పొందేదుకు అర్హులే.

ఈ శ్రమ కార్డు ని పొందడం ఎలా..?

ఈ కార్డు ని ఈజీగా పొందొచ్చు. ఎలాంటి కష్టం అక్కర్లేదు. ఇ-లేబర్ కార్డును పొందడానికి మీరు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి వుంది.
ముందుగా ఇ-లేబర్ పోర్టల్‌కి వెళ్ళండి.
అక్కడ రిజిస్టర్ ఆన్ ఇ-లేబర్ పైన క్లిక్ చేయండి.
నెక్స్ట్ మీరు మీ మొబైల్ నంబర్ ని ఇవ్వండి.
తరవాత OTP వస్తుంది. దాన్ని నమోదు చేయండి.
ఇప్పుడు ఇ-లేబర్ కార్డ్ ఫారమ్‌ను నింపి సబ్మిట్ చేయండి.
ఇక మీరు మీ ఇ-లేబర్‌ని ఆన్‌లైన్‌ లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అంతే.

ఇ-లేబర్ కార్డ్ వలన కలిగే లాభాలు:

ఈ-లేబర్ పోర్టల్‌ లో నమోదు చేసుకున్న కొద్ది రోజులకు కార్డు వస్తుంది.
దీని వలన కార్మికులందరు ఒకే ప్లాట్‌ఫారమ్‌పై అనుసంధానం అవ్వచ్చు.
ఇప్పుడు దీనిలో నమోదు చేసుకున్న వారికి రూ.2 లక్షల ప్రమాద బీమా వస్తుంది.

కావలసిన డాక్యుమెంట్లు:

రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాల్సి వుంది.
ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్‌బుక్ సబ్మిట్ చేయాల్సి వుంది.

Read more RELATED
Recommended to you

Latest news