అందరికీ పాన్ కార్డు ని ప్రూఫ్ గా ఇచ్చేయద్దు.. పాన్ కార్డు ఏయే వాటికి అవసరమంటే..?

-

పాన్ కార్డ్ ఎంత ముఖ్యమో మనకు తెలుసు. చాలా వాటికి పాన్ ప్రూఫ్ గా పక్కా ఉండాలి. పాన్ కార్డ్ ఆర్థిక లావాదేవీల కోసం ఎంతో ముఖ్యం. అలానే ఇంకా చాలా వాటికి పాన్ కార్డు ని ప్రూఫ్ గా ఇవ్వాల్సి వుంది. అయితే దేనికి పడితే దానికి పాన్ ని ఇచ్చేయక్కర్లేదు. అన్నిటికీ పాన్ ప్రూఫ్ అవసరం లేదు. వీటికి మాత్రం పాన్ కార్డు ప్రూఫ్ గా పక్కా ఇవ్వాల్సి వుంది. అయితే వేటి కోసం పాన్ ని ప్రూఫ్ గా ఇవ్వాల్సి వుంది అనేది చూసేద్దాం.

పాన్ కార్డు ఆదాయపు పన్ను రిటర్న్‌ క్లెయిమ్ చేయడానికి అవసరం. పన్ను కంటే TDS
ని తీసివేయబడిన సందర్భాలలో బ్యాంక్ ఖాతా తో పాన్ కార్డ్‌ని లింక్ చేసి అదనపు మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. దీని కోసం పక్కా పాన్ కార్డు ఉండాలి.
బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చేసేందుకు పాన్ కార్డ్ కూడా అవసరం అవుతుంది.
భారతీయ కరెన్సీని విదేశీ కరెన్సీగా మార్చాలనుకుంటే కూడా పాన్ ఇవ్వాలి ప్రూఫ్ గా.
FDలో 50 వేల రూపాయల కంటే ఎక్కువ ఉంటే కూడా పాన్ కార్డు ఇవ్వాలి.
కొత్త ఫోన్ లేదా మొబైల్ కనెక్షన్ కోసం సెల్యులార్ ఆపరేటర్లకు పాన్ ఇవ్వాల్సి వుంది.
వస్తువులు, సేవల కొనుగోలు లేదా అమ్మకం కోసం ఇవ్వాలి.
అలానే నగలు కొనుగోలు రూ.5 లక్షల కంటే ఖర్చు చేస్తే అప్పుడు పాన్ కార్డు ఇవ్వాల్సి వుంది.
మీరు లోన్ పొందాలంటే కూడా పాన్ కార్డు అవసరం. పాన్ కార్డ్‌తో సహా లోన్ కోసం అన్ని డాక్యుమెంట్లు అవసరం.
అలానే పెట్టుబడి ప్రయోజనాల కోసం కూడా కావాలి. రూ.50,000 కంటే ఎక్కువ లావాదేవీల కోసం పక్కా పాన్ ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటి కోసం కూడా అవసరం.
ప్రాపర్టీని కొనుగోలు చేసేటప్పుడు అవసరం లేదా అద్దెకు ఇచ్చేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు కూడా కావాల్సి వుంది.

Read more RELATED
Recommended to you

Latest news