పవన్ కళ్యాణ్ 5 పంటల పేర్లు చెప్పగలడా? – కాకాని

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయం గురించి తెలియని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం అనవసరం అన్నారు. తాను పది పంటలు చూపిస్తానని.. పవన్ కళ్యాణ్ కేవలం 5 పంటల పేర్లు చెప్పగలరా? అని ప్రశ్నించారు.

అలా చెబితే పవన్ కళ్యాణ్ కి వ్యవసాయం తెలుసని అంగీకరిస్తానన్నారు. చంద్రబాబు తన హయాంలో రైతులకు ఎంత నష్టపరిహారం ఇచ్చాడో ప్రజలందరికీ తెలుసు అన్నారు కాకాని. ప్రాజెక్టులు కడితే రాబడి ఉండదు అన్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబు ఓ అవగాహన, బుద్ధి జ్ఞానం లేని వ్యక్తి అన్నారు. తాను పదవి నుండి దిగేటప్పటికీ రైతులకు బకాయిలు పెట్టి వెళ్లలేదని చంద్రబాబు చెప్పగలరా? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news