ఈ ఫొటోలో ఉన్న కాలి వేళ్లు ఎవరివి ? చెప్ప‌గ‌ల‌రా ?

-

సోష‌ల్ మీడియాలో చిత్ర‌మైన పోస్టులు వైర‌ల్ అవుతుంటాయి. వాటిల్లో చాలా వ‌ర‌కు షాక్‌కు గురి చేసే ఫొటోలే మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. అయితే కింద ఇచ్చిన ఫొటో కూడా స‌రిగ్గా అలాంటిదే. ఆ ఫొటోను చూస్తే ఎవ‌రికైనా ఒళ్లు జ‌ల‌ద‌రించిన‌ట్లు అవుతుంది. ఏంటీ.. మ‌రీ ఇంత అస‌హ్యంగా కాలివేళ్లు ఉన్నాయి. అని ఎవ‌రైనా అనుకుంటారు. అయితే నిజానికి ఆ ఫొటోలో ఉన్న మనిషి కాలి వేళ్లు కాదు, అలా అని చెప్పి అవి గొరిల్లా లాంటి జంతువుల కాలి వేళ్లు కూడా కాదు.. మ‌రైతే అవి ఏమిటి ? అంటే…

can you identify whose foot fingers are these

ఏంటీ.. ఇంకా ఆ ఫొటోలో ఉన్న‌వేమిటో గుర్తు ప‌ట్ట‌లేదా ? అయితే చెబుతాం.. వినండి.. అవి మ‌నిషి కాలి వేళ్లు కాదు, అలా అని చెప్పి ఇతర జీవుల కాలి వేళ్లు కూడా కావు. కానీ చూసేందుకు అవి అచ్చం అలాగే క‌నిపిస్తాయి. నిజానికి అదొక ఫంగ‌స్. దాన్ని డెడ్‌మ్యాన్స్ ఫింగ‌ర్స్ అని పిలుస్తారు. అంటే చ‌నిపోయిన వారి వేళ్లు అని అర్థం వ‌స్తుంది. స‌రిగ్గా.. ఈ ఫంగ‌స్ కూడా అచ్చం చ‌నిపోయిన వారి కాలి వేళ్ల‌ను పోలి ఉంటుంది. అందుక‌నే దాన్ని ఆ పేరుతో పిలవ‌డం మొద‌లు పెట్టారు. ఇక ఈ ఫంగ‌స్ నిలువుగా పుట్ట‌గొడుగుల్లాగే పెరుగుతుంది. 3 లేదా 6 ఫంగ‌స్‌లు క‌లిపి వేళ్ల‌లా ఒకేసారి పెరుగుతాయి. అచ్చం అవి కాలి వేళ్ల‌లాగే ఉంటాయి. అలాగే అదే సైజులో మ‌న‌కు క‌నిపిస్తాయి. అందుక‌నే ఆ ఫంగ‌స్‌ను చూసి చాలా మంది పొర‌బ‌డుతుంటారు.

ఇక ఆ ఫొటోను ఓ ట్విట్ట‌ర్ యూజ‌ర్ షేర్ చేయ‌గా.. అది ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. ఆ ఫొటోలో ఉన్న కాలి వేళ్ల ముద్ర‌లు ఎవ‌రివబ్బా.. అంటూ నెటిజ‌న్లు తెగ వెదుకుతున్నారు. కానీ ఆ ఫోటోను షేర్ చేసిన స‌ద‌రు యూజ‌రే దాని వివ‌రాల‌ను చెప్పాడు. ఏది ఏమైనా.. ఈ ఫంగ‌స్ మాత్రం అచ్చం మ‌నిషి కాలి వేళ్ల‌ను పోలి ఉండ‌డం నిజంగా విశేష‌మే మ‌రి..!

Read more RELATED
Recommended to you

Latest news