కెనడాలో కన్నుల పండుగగా సంక్రాతి సంబారాలు…!!!

తెలుగువాళ్ళందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి పేరు చెప్తేనే పల్లెలన్నీ పులకరించి పోతాయి. సంక్రాంతి మూడు రోజులు పల్లెలన్నీ రంగవల్లులతో ముస్తాబయ్యి ఉంటాయి. కోడి పందాలు, గాలిపటాలు, ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో ఆటపాటలతో కోలాహలంగా మారిపోతాయి పల్లెలన్నీ. అయితే భారత దేశంలో ఏ నలుమూలల తెలుగు వారు ఉన్నా సంక్రాంతి పండుగాకంటే ముందే పల్లెల్లకి రెక్కలు కట్టుకుని వాలిపోతారు. విదేశాలలో ఉన్న తెలుగు వారు సైతం ఈ పండుగని జరుపుకోవడానికి సొంత గ్రామాలకి వస్తారు అయితే

చాలా మంది ఎన్నారైలు విదేశాలలో ఉంటూనే సంక్రాంతి వేడుకలని జరుపుకుంటూ ఉంటారు. సొంత గ్రామాలలో లేమనే లోటుని లేకుండా స్థానికంగా ఉండే తెలుగు ఎన్నారైలు అందరిని కలుపుకుంటూ ఎంతో వైభవంగా విదేశాలలో కూడా సంక్రాంతి శోభని తీసుకువస్తారు. ఈ క్రమంలోనే కెనడాకి చెందిన ఓ తెలుగు ఎన్నారై సంస్థ సంక్రాంతి వేడులకని ఘనంగా జరుపుకుంది.

కెనడాలో తెలుగువారి కోసం ఏర్పాటు చేసిన తెలుగు సంఘం తెలంగాణా కెనడా తెలుగు సంఘం. ఈ సంఘం ఆధ్వర్యంలో టొరంటో లోని సెంకండరీ స్కూల్ ఆడిటోరియంలో సంక్రాంతి తీన్ మార్ వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకి భారత సంతతి  వ్యక్తి ఒరియంటో పార్లమెంట్ సభ్యులు అయిన దీపక్ ఆనంద్ ముఖ్య అతిధిగా వచ్చి ప్రారంభించారు.ఎన్నారైల చిన్నారులని భోగి పళ్ళు పోసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగువారందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.