భారతీయ సిక్కులకి అమెరికా అరుదైన గుర్తింపు..!!!

-

ప్రపంచం నలుమూలల నుంచీ అమెరికాకి వివిధ దేశాల వారు వలసలు వెళ్తూ ఉంటారు. అలా వలసలు వెళ్ళిన వారిలో అత్యధికులు భారతీయులే. అలా ఇప్పటి వరకూ అమెరికాకి వెళ్ళిన భారతీయుల సంఖ్య అన్ని దేశాలతో పోల్చితే ఎక్కువగానే ఉంది. అయితే భారత దేశం నుంచీ అమెరికా వెళ్ళిన భారతీయులలో అత్యధికులు మాత్రం సిక్కులే అంటున్నాయి అక్కడి సర్వేలు. అమెరికాలో సిక్కులు ఏకంగా తమకంటూ ఓ ప్రాంతాన్ని సైతం ఏర్పాటు చేసుకోవడమే కాదు. అక్కడి చట్టసభలలో సిక్కుల ఓట్లతో గెలిచి సిక్కు నేతలుగా ఎదిగిన వారు కూడా లేకపోలేదు.

అమెరికా లెక్కల ప్రకారం ఇప్పటివరకూ అమెరికాలో ఉంటున్న సిక్కుల సంఖ్య సుమారు 10 లక్షల పైమాటేనట. ఎన్నో ఏళ్ళుగా తమతో కలిసి ఉన్న సిక్కులకి అమెరికా ప్రజలు ఎంతో గౌరవం ఇస్తారు. ఇదిలాఉంటే 2020 జనాభా లెక్కల ప్రకారం సిక్కులని ప్రత్యేకమైన జాతిగా గుర్తిస్తామని త్వరలోనే ఆ ప్రకటన వెలువడుతుందని అక్కడి సెన్సస్ అధికారులు అధికారికంగా ప్రకటించారు.

 

అమెరికా ప్రభుత్వం సిక్కులకి ఈ అరుదైన గుర్తింపు ఇవ్వడంతో అమెరికాలోని సిక్కు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.  గత రెండు దశాభ్దాలుగా మేము ఈ హక్కు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని. ఎన్నో సార్లు ప్రభుత్వానికి వినతులు ఇచ్చామని ఇన్నాళ్ళకి మా కోరిక నెరవేరిందంటూ సిక్కు సొసైటీ ప్రెసిడెంట్ బజీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు అమెరికా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news