బ్రేకింగ్ : సంజయ్ దత్ కి క్యాన్సర్..ఏ స్టేజ్ అంటే ?

-

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆరోగ్యానికి సంబంధించి ఒక సంచలన అంశం బయటకొచ్చింది. ఆయనకు తాజాగా స్టేజ్ 3 లంగ్ క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. నిజానికి ఆయనకు శ్వాస సంబందిత సమస్యలు రావడంతో మొన్న శనివారం ఆసుపత్రికి తరలించారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో మూడు రోజుల పాటు వైద్యుల సంరక్షణలో ఉన్న ఆయన నిన్ననే ఇంటికి వచ్చారు. ఈ సమయంలో తను బాగానే ఉన్నాయని ఆయన చెప్పారు.

అయితే ఆయన ఆసుపత్రిలో ఉన్న సమయంలో కొన్ని పరీక్షలు చేశారని, ఆ పరీక్షా ఫలితాలు కొద్ది సేపటి కిందట వెలువడగా వాటిలో ఆయనకు క్యాన్సర్ అన్న విషయం తేలింది. దీంతో ఆయన ఇప్పుడు చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు. ఈ క్యాన్సర్ నయం అయ్యేదేనని కాకపోతే మేడికేషన్ వెంటనే మొదలు పెట్టాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన అమెరికా వెళ్లనున్నారు. ఇక చిన్న వయసులోనే ఆయన తాగుడుకు, సిగరెట్లలు, మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డట్టు ఆయన బయోపిక్ లో చూపారు. ఆ అలవాట్లే ఆయన కొంప ముంచాయని అభిమానులు బాధ పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news