చాక్లెట్ దొరికినంత ఈజీగా తెలంగాణలో గంజాయి దొరుకుతుంది : బీజేపీ ఎమ్మెల్యే

-

సుల్తానాబాద్ అత్యాచార ఘటనతోనైనా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కనువిప్పు కలగాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు అన్నారు.ఇంటి తగాలతో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కుంటుపడిందని, మంత్రివర్గాన్ని కూడా విస్తరించలేని స్థితిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణకు హోంమంత్రి లేకపోవడం వల్లే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని ఆయన మండిపడ్డారు.

ఢిల్లీకి డబ్బులు పంపించే పనిలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారని ఆరోపించారు. చాక్లెట్ దొరికినంత ఈజీగా తెలంగాణలో గంజాయి దొరుకుతుందని అని మండిపడ్డారు.రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందని ఆరోపించారు. మంత్రులు ఎవరి సంపాదనలో వాళ్లు బీజీబీజీగా ఉన్నారని విమర్శించారు. వరసగా బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే రివ్యూ చేయలేని స్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఒక్క నెలలోనే మియాపూర్ నడిగడ్డతండా, సుల్తానాబాద్ హత్యాచార ఘటనలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news