సీఎం చంద్రబాబు హెచ్చరికలతో జారుకునే ప్రయత్నం.. చెక్ పెట్టిన సిఎస్

-

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.దీంతో కొంతమంది అధికారులు వేరే చోటే ఉద్యోగాలు చూసుకుని తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ తాజాగా అదేబాటలో నడిచారు. మూడు రోజుల క్రితం నార్త్ ఈస్ట్రన్ రైల్వేలో జాయిన్ అయ్యారు. అటు రైల్వే ఉన్నతాధికారులు కూడా వెంటనే పోస్టింగ్ ఇచ్చారు. దీంతో మార్గం సుగుమం అయిందనకున్న సత్యనారాయణకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి నీరబ్ కుమార్ భారీ జలక్ ఇచ్చారు. ఈస్ట్రన్ రైల్వేలో సత్యనారాయణ జాయిన్ అవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీవింగ్ అర్డర్ సమర్పించాల్సి ఉంటుందని సీఎస్ నిలిపివేశారు. గత ప్రభుత్వంలో సత్యనారాయణ వైసీపీ నేతలకు అనుకూలంగా పని చేశారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో సత్యనారాయణను రిలీవ్ కావొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. అటు ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రావత్ ఈ నెల 18 వరకూ లీవ్‌లో ఉండటంతో సత్యనారాయణ ప్రయత్నాలకు చీఫ్ సెక్రటరీ చెక్ పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news