దేని మీదా ఏకాగ్రత పెట్టలేకపోతున్నారా..? ఆయితే ఈ తప్పులని చెయ్యద్దు..!

-

ఒక్కొక్కసారి మనం ఏ పని చేయాలనుకున్నా సరే దాని మీద మనకి ధ్యాస వెళ్ళదు. మనం ఏకాగ్రత పెట్టలేము కూడా. మీకు కూడా ఇలానే అనిపిస్తూ ఉంటుందా…? అయితే కచ్చితంగా ఇది మీరు చూడాలి. వీటిని చూస్తే ఎలా ఫోకస్ చేయాలి ఎలా మనం అనుకున్న పనులను పూర్తి చేయొచ్చు అనేది తెలుస్తుంది. నిజానికి చాలా మంది చేసే చిన్న చిన్న తప్పుల వలన ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం.

టైం మేనేజ్మెంట్:

ప్రతిరోజు టైం మేనేజ్మెంట్ అనేది కచ్చితంగా ఉండాలి మనం ఏ పనులు చేస్తున్నాం ఇంకా ఎన్ని పనులు మిగిలిపోయాయి ఎంత టైం మిగిలి ఉంది.. ఇలాంటివి చూసుకుంటూ ఉండాలి. సరిగ్గా మీ టైం ని మీరు ఉపయోగించకపోతే మీరు ఫోకస్ ని కోల్పోతూ ఉంటారు.

గోల్స్ లో తప్పులు:

చాలామంది ఏదైనా గోల్ ని పెట్టుకునే ముందు అధికంగా గోల్స్ పెట్టేసుకుంటూ ఉంటారు దీనివలన ఏకాగ్రత దెబ్బతింటుంది. పనులు పూర్తి చేయలేము.

నిద్రపోకపోవడం:

సరైన నిద్ర లేకుండా సరైన రెస్ట్ లేకుండా మీరు ఎక్కువ పనులు చేసుకుంటున్నట్లయితే పనుల మీద మీరు ఏకాగ్రత పెట్టలేరు. మీ ఏకాగ్రత పూర్తిగా దెబ్బతింటుంది.

మల్టీ టాస్కింగ్:

చాలామంది ఒకేసారి ఎక్కువ పనులు చేసేయాలని అనుకుంటూ ఉంటారు. ఇలా మల్టీ టాస్కింగ్ చేసే సమయంలో ఏమవుతుందంటే ఏకాగ్రత దెబ్బతింటుంది.

డిస్ట్రాక్షన్స్:

కొన్ని కొన్ని సార్లు డిస్ట్రాక్షన్స్ వలన కూడా మనం ఏకాగ్రత పెట్టలేము ఎప్పుడైనా సరే ముఖ్యమైన పనులు ఉండేటప్పుడు డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకుండా చూసుకోండి ఇలా ఈ విధంగా మీరు అనుసరిస్తే ఖచ్చితంగా మీరు మీ పనులను సరైన సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు.

Read more RELATED
Recommended to you

Latest news