కరోనాకి వ్యాక్సిన్ కనుక్కోలేరా…?

-

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు వేగంగా వృద్ది చెందుతుంది. తన వ్యాప్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటుకుంటుంది. మొన్నటి వరకు 500 వరకు ఉన్న రోగుల సంఖ్య నేడు 2 వేలకు పైగా ఉంది. మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ముందు జలుబు, దగ్గుతో మొదలవుతున్న ఈ వ్యాధి ఆ తర్వాత నిమోనియా మాదిరి మారిపోయి ఆ తర్వాత ఊపిరి సలపకుండా ప్రాణాలు తీస్తుంది.

జపాన్, తైవాన్, నేపాల్, అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, కెనడా, వియత్నాం, హాంగ్‌కాంగ్, మలేసియా, సింగపూర్, దక్షిణ కొరియా, థాయ్‌ల్యాండ్ దేశాలకు ఈ వైరస్ సోకింది. చైనాలో ఇందుకోసం ప్రత్యేక ఆస్పత్రి నిర్మాణాలకు కూడా శ్రీకారం చుడుతున్నారు. మన దేశంలో అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రత్యేక థెర్మల్ స్క్రీనింగ్ టెస్టులు జరుపుతున్నారు. చైనా లో ఉన్న మన విద్యార్ధులను ఇక్కడికి వచ్చేయమని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

హైదరాబాద్ లో చైనా వెళ్లి వచ్చిన ఒక వ్యక్తికి ఆ వ్యాధి వచ్చింది అనే ప్రచారం నగర వాసులను భయపెట్టింది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు కూడా చేసింది. వైరస్ లపై అవగాహన ఉన్న వారిని విమానాశ్రయాల్లో నియమిస్తున్నారు. చైనా ఇందుకు వ్యాక్సిన్ ని కనుక్కోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే అసలు ఇది ఏ విధంగా అంతమవుతుంది అనేది కూడా చైనాకు స్పష్టత రావడం లేదు. దీనితో అక్కడి వైద్యులు కూడా ఎప్పటి లోగా దీన్ని కనుక్కునే అవకాశం ఉందో కూడా చెప్పలేకపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news