మాస్టర్ భరత్ గుర్తున్నాడు కదూ…? వెంకీ, రెడీ, ఢీ, కింగ్, బిందాస్ వంటి సినిమాల్లో చిన్న వయసులోనే తనదైన కామెడీతో ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు. భరత్ ఉంటే చాలు సినిమాలో కామెడి హైలెట్ అవుతుందని అప్పట్లో మంచి టాక్ ఉండేది. ప్రత్యేకంగా బాబు సైజ్ కే మంచి ఫాన్స్ ఉండేవారు. బొద్దు బొద్దు గా ముద్దు ముద్దుగా ఉంటూ భరత్ మంచి టైమింగ్ తో కామెడి చేసే వాడు.
అయితే ఇప్పుడు కనుమరుగు అయ్యాడు. అవ్వడం ఏముందిలే గాని పెద్దాడు అయిపోయాడు కదా… అందుకే మాస్టర్ భరత్ నుంచి నటుడు భరత్ అయ్యాడు. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యులో భరత్ ఒక సంచలన విషయం చెప్పాడు. చెన్నైలో తాను కాలేజిలో చదివే రోజుల్లో తన కన్నుకి ప్రమాదం జరిగి కనపడటం మానేసిందని చెప్పాడు. వర్కౌట్ చేస్తున్నప్పుడు రాడ్‌లో ఉండే స్ప్రింగ్ వచ్చి కన్నుకి గట్టిగా తగిలిందట.
దీనితో వైద్యుల దగ్గరకు వెళ్తే వైద్యంతో నయమవుతుందని చెప్పారట. కాని అది అలానే వేధించిందని ఇప్పటికి తన కన్ను ఎక్కువగా లైటింగ్ చూస్తే కనపడే అవకాశం ఉండదని చెప్పాడు. అందుకే తాను గ్లాస్ పెట్టుకుని కాలేజ్ కి వెళ్లినట్టు చెప్పాడు భరత్. తన చదువు గురించి కూడా చెప్పాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మెడిసిన్ పూర్తి చేశా అని ప్రస్తుతం మెడిసిన్‌లోనే డాక్టరేట్ చేస్తున్నా అని చెప్పుకొచ్చాడు భరత్.