తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంట చైనాతో సరిహద్దు వివాదాలను ముగించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం (అక్టోబర్ 25, 2020) స్పష్టం చేసారు. ఆయన భారత సైన్యంపై విశ్వాసం వ్యక్తం చేసారు. మన భూమిలో ఒక అంగుళం కూడా ఎవరూ తీసుకోలేరు అని ధీమా వ్యక్తం చేసారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తత అంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.
శాంతిని పరిరక్షించాలని భారతదేశం కోరుకుంటుందని చెప్పారు. అలాగే, మన సైన్యం మన భూమిలో ఒక్క అంగుళం కూడా తీసుకోనివ్వదని నా నమ్మకం అని రక్షణ మంత్రి అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలోని భారత సైన్యం యొక్క 33 కార్ప్స్ యొక్క సుక్నాకు చెందిన ప్రధాన కార్యాలయంలో “శాస్త్ర పూజ” సందర్భంగా సింగ్ ఈ ప్రకటన చేశారు.