ఇజ్రాయిల్ లో రెగ్యులేటరీ ఆమోదం పొందిన తరువాత నవంబర్ 1 నుండి తమ దేశంలో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది . ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ రీసెర్చ్ (ఐఐబిఆర్) తన “బ్రిలైఫ్” వ్యాక్సిన్ కోసం మార్చిలో జంతువుల మీద పరీక్షలను ప్రారంభించింది. దీన్ని తదుపరి దశకు తీసుకెళ్లడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు పర్యవేక్షణ కమిటీ ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.
వైరస్ ప్రతిరోధకాలు అభివృద్ధి చెందుతాయో లేదో తెలుసుకోవడానికి 18 నుంచి 55 ఏళ్ల మధ్య ఎనభై మంది వాలంటీర్లను మూడు వారాల పాటు పర్యవేక్షిస్తామని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి వాలంటీర్ కి ఇంజెక్షన్ ఇస్తామని అన్నారు. కొన్ని గంటల పరిశీలన తర్వాత వారిని విడుదల చేస్తారు అన్నారు.