నలుగురిలో ఉన్నప్పుడు మనం చాలా డీసెంట్‌గా ఉండాలి.. మీకు నచ్చకున్నా ఇలానే ఉండాలి. ఇంట్లో ఉన్నట్లు బయట కూడా ఉంటే కుదరదు..ముఖ్యంగా ఆఫీసులో, కాలేజ్‌లో, ఫంక్షన్స్‌లో ఇలా పబ్లిక్ గాథరింగ్స్‌లో మనం ఎంత డీసెంట్‌గా ఉంటే మనపై అంత మంచి ఇంప్రషన్ ఉంటుంది. డీసెంట్ అంటే నీట్‌గా డ్రస్ వేసుకుంటే సరిపోదు. బీహేవియర్ కూడా .. అయితే మన చేతుల్లో ఉంటే ఎంతైనా చేయొచ్చు.. కానీ మన చేతుల్లో లేని వాటి సంగేతేంటి.. అపానవాయువు లేదా గ్యాస్ ఇబ్బంది గురించి అందరికీ తెలిసిందే.. దీన్ని ఎవరూ నియంత్రించలేరు. పబ్లిక్‌లో ఉన్నా అది ఆగదు.. దాని వల్ల అవతల వ్యక్తుల్లో మనల్నీ అదేదో ఘోరం చేసినట్లు చూస్తారు..మీకు గిల్టీగా ఉంటుంది. మరీ ఈ సమస్యను నియంత్రించడం ఎలా..।
కడుపులో గ్యాస్ తయారవటానికి అనేక కారణాలున్నాయి. శరీరంలో తయారైన అపానవాయువు జీర్ణవ్యవస్థ నుంచి మలమార్గం గుండా బయటకు వెళ్తుంది. దీనిని సాధారణంగా ఇంగ్లీషులో ‘పాసింగ్ విండ్’ లేదా ‘ఫార్టింగ్’ అని పిలుస్తారు. తెలుగులో అయితే అపానవాయువు, పిత్తు అంటారు. ఈ అపానవాయువు శబ్ధం లేకుండా వచ్చినపుడు దుర్వాసనగా ఉంటుంది. ఇతరులకు ఇబ్బందికరంగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. శబ్ధంతో వస్తే స్మెల్ రాదు కానీ.. మిమ్మల్ని నలుగురిలో నవ్వులపాలు చేస్తుంది. ఆ సౌండ్‌కు వేసింది మీరే అని తెలిసిపోతుంది.
అపానవాయువు ఎలా ఏర్పడుతుంది..?
అపానవాయువు తరచుగా అజీర్ణం లేదా మీరు తీసుకునే ఆహార పదార్థాల వలన వస్తుంది. మనం ఏదైనా తినేటప్పుడు లేదా త్రాగినప్పుడు, ఆహారపదార్థాలు, పానీయాలతో పాటుగా కొంత గాలిని కూడా మింగేస్తాము. ఈ గాలిలోని ఆక్సిజన్, నైట్రోజన్ వంటి వాయువులు జీర్ణవ్యవస్థలో చిక్కుకొని పోతాయి. మన జీర్ణవ్యవస్థ మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేస్తున్నప్పుడు, జీర్ణక్రియ ప్రక్రియలో భాగంగా హైడ్రోజన్, మీథేన్ లేదా కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులు విడుదలై మన కడుపులో పేరుకుపోతాయి. ఈ వాయువులు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. దాదాపు ప్రతి ఒక్కరు తమ జీవితంలో గ్యాస్ సమస్యను ఎదుర్కొంటారు. కడుపులో అధికంగా పేరుకుపోయిన గ్యాస్ శరీరంలోని వ్యవస్థలు బయటకు పంపివేస్తాయి.
మీరు తరచుగా అపానవాయువు, గ్యాస్ వంటి ఇబ్బందులు ఎదుర్కొంటుున్నట్లేతే.. ఈ చిట్కాలు పాటించండి..
వాము
అజ్వైన్ లేదా వాము విత్తనాలు మీ శరీరంలో చిక్కుకున్న గ్యాస్, కడుపు నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.. ఎన్నో ఏళ్లగా అందరికీ తెలిసిన విషయమే అయినా.. గ్యాస్ ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం ఇది మీరు పాటించరు.. ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు.. భోజనం చేసిన తర్వాత లేదా ఎప్పుడైనా కడుపు ఉబ్బరం లేదా అపానవాయువును ఎదుర్కొంటున్నప్పుడు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ వాము విత్తనాలు వేసి ఆ నీటిని తాగితే సరి.!.
జీరా
జీరా లేదా జీలకర్ర మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. చాలా మంది డైటీషియన్లు, పోషకాహార నిపుణులు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు జీరా నీటిని తాగాలని సూచిస్తారు. దీనివల్ల పొట్టలో పేరుకున్న కొవ్వు అంతా కరిగిపోతుంది. ఉబ్బరం లేదా అపానవాయువు సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు కూడా మీరు ఈ జీరా వాటర్ తాగితే మంచి ఉపశమనం ఉంటుంది.
ఇంగువ
ఇంగువ మీ వంటగదిలో లభించే అద్భుతమైన పదార్థాలలో ఒకటి. ఇది యాంటీ ఫ్లాట్యులెంట్‌గా పనిచేస్తుంది. మీ కడుపులో అదనపు గ్యాస్‌కు కారణమయ్యే గట్ బ్యాక్టీరియా పెరుగుదలను అరికడుతుంది. మీరు ఒక టీస్పూన్ ఇంగువను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి భోజనం తర్వాత లేదా మీకు అసౌకర్యంగా అనిపించినప్పుడు ఎప్పుడైనా తాగవచ్చు. అయితే దీన్ని ఎక్కువగా తీసుకోకండి, ఇది ఛాతీలో మంటను కలిగిస్తుంది.
లెమన్ సోడా
లెమన్ సోడా కూడా అపానవాయువు నుంచి మంచిగా విముక్తి కలిగిస్తుంది. మీరు ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం, కొంచెం బేకింగ్ పౌడర్ మిక్స్ చేసి నిమ్మ సోడాను తయారు చేసుకోవచ్చు. భోజనం తర్వాత తీసుకుంటే గ్యాస్ నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. ఇది భారీ భోజనం తర్వాత, ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది.
త్రిఫల
త్రిఫల అనేది మలబద్ధకంతో సహా అనేక జీర్ణ రుగ్మతలను సరిచేయడంలో సహాయపడే దివ్యౌషధం. ఒక టీస్పూన్ త్రిఫల పొడిని గోరువెచ్చని నీటిలో కలపి రోజుకు ఒకసారి తాగాలి.
అయితే ఇంట్లో ఉంటే ఇవి చేయొచ్చు..బయటకు వెళ్తే ఎలా..? అని మీకు డౌట్ రావొచ్చు.. వీటిల్లో ఏదైతే మీకు ఉపశమనం ఇస్తుందో వాటిని చిన్న బాక్స్‌లో మీ హ్యాండ్‌బ్యాగ్‌లో క్యారీ చేయండి. ఇబ్బందిగా అనిపించినప్పుడు బాటిల్లో వేసుకుని అలా అయినా తాగేయొచ్చు.. ఇది పెద్ద రిస్క్ అయితే కాదు కదా..!