రైల్వే ట్రాక్ పై ఒక్కసారిగా ఇంధన ట్రక్కు పేలింది. భారీగా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో అదే మార్గంలో నుంచి ఓ కార్గో రైలు వస్తోంది. మంటలు చూసి ఆగకుండా ఆ మంటల్లో నుంచే వేగంగా ఆ కార్గో రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుంది అంటే..?
సెంట్రల్ మెక్సికోలోని అగాస్కాలైంటిస్ నగరంలో భారీ ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్‌పై ఇంధన ట్రక్కు పేలింది. దీంతో అక్కడ భారీగా మంటలు వ్యాపించాయి. అయితే ఆ మంటల మీద నుంచే కార్గో రైలు వెళ్లింది. గమనించిన అధికారులు.. స్థానికంగా ఉన్న సుమారు వెయ్యి మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
మంటలపై నుంచి కార్గో రైలు వెళ్తున్న సమయంలో కొందరు అక్కడే ఉండి వీడియోలు తీశారు. భయంతో కొందరు కార్లలోనే దాక్కుకున్నారు. సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించడంతో.. అక్కడ నుంచి సుమారు 12 మందిని రక్షించారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెబుతున్నారు. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
*CARGO TRAIN DRIVES THROUGH FLAMES AFTER CRASHING INTO A FUEL TRUCK IN CENTRAL MEXICO, CAUSING MULTIPLE TO DOZENS OF HOMES ON FIRE.pic.twitter.com/ennX3XWgWf
— Dredre babb (@DredreBabb) October 21, 2022