తెలంగాణలో కొనసాగుతున్న కరోనా కేసులు …!

-

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసు వివరాలను హెల్త్ బులిటెన్ ద్వారా విడుదల చేసింది. ఇక బులిటెన్ చూస్తే నేడు ఒక రోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1831 మంది కరోనా బారిన పడ్డారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 25,733 కు చేరుకుంది. ఇక నేడు ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 6,383 శాంపిల్స్ ను పరీక్షించారు.

carona telangana
carona telangana

మరోవైపు తెలంగాణ రాష్ట్ర మొత్తంగా  నేడు ఒక్కరోజే 11 మంది కరోనా బారినపడి మృతి చెందారు. దీంతో రాష్ట్రం మొత్తంలో ఇప్పటివరకు 306 మంది కరోనా బారినపడి మృతి చెందారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 10,646 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. నేడు ఒక్కరోజే జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 1419 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం హైదరాబాదులో కరోనా కేసులతో హాస్పిటల్స్ పూర్తిగా నిండిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news