రేవంత్ బ్యాగ్ లు మోసి మోసి సీఎం అయిండు : కేటీఆర్

-

రేవంత్ రెడ్డి బ్యాగ్ లు మోసి మోసి సీఎం అయిండు అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.  పాలమూరు రంగారెడ్డి కడితే రేవంత్ రెడ్డికి కమీషన్లు రావు అన్నారు. జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగులను మోసం చేసిండు. కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ ఇప్పటికీ వస్తుంది. రుణమాఫీ అని చెప్పి రైతులను మోసం చేసిండు.

తెలంగాణ ఈస్ రైజింగ్ అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అవును  తెలంగాణ ఇస్ రైజింగ్.. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ అప్పులల్లో, ఆత్మహత్యల్లో, క్రైమ్ రేట్లో రైజింగ్ అన్నారు. అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేధిస్తుందన్నారు. మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు ఇలా అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. మరోవైపు త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news