కోర్టు ఆదేశాలు..డైరెక్టర్ RGVపై కేసు నమోదు చేసిన పోలీసులు..ఎందుకంటే?

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతీ విషయమై తన అభిప్రాయాలను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతుంటారు. వివాదాలను క్రియేట్ చేసి అలా సంచలనాలు రేపుతుంటారు. కాగా, తాజాగా ఆయనపైన ఓ సంచలనం క్రియేట్ అయింది.

ram-gopal-verma

డైరెక్టర్ RGVపైన కేసు నమోదయింది. తీసుకున్న డబ్బు తనకు తిరిగి ఇవ్వడం లేదని శేఖర్ రాజు అనే వ్యక్తి హైదరాబాద్ లోని కూటక్ పల్లి కోర్టును ఆశ్రయించారు. ‘దిశ’ పిక్చర్ నిర్మాణం కోసం వర్మ తన వద్ద నుంచి రూ.56 లక్షలు తీసుకున్నాడని శేఖర్ రాజు పేర్కొన్నాడు.

తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా వర్మ బెదిరించాడని ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు విచారణ అనంతరం కూకట్ పల్లి కోర్టు RGVపై కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించింది. దాంతో పోలీసు అధికారులు IPC 406,407, 506 సెక్షన్స్ కింద రామ్ గోపాల్ వర్మపై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ కేసుపై వర్మ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Latest news