‘తలపతి66’ అప్‌డేట్..ఫస్ట్ లుక్ రిలీజ్ టైమ్ ఫిక్స్

-

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్- టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘తలపతి66’. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఫిల్మ్ లో క్యూట్ బ్యూటీ రష్మిక మందన ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రజెంట్ హైదరాబాద్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల డైరెక్టర్ వంశీ, హీరో విజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఆల్రెడీ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ‘మహర్షి’ వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘తలపతి 66’ కాగా, ఈ పిక్చర్ పైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ చిత్రం తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది.

ఇక ఈ సినిమాలో భారీ తారాగణమే ఉంది. ప్రకాశ్ రాజ్, జయసుధ, శ్యామ్, శ్రీకాంత్, శరత్ కుమార్, ప్రభుతో పాటు పలువురు నటీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కుటుంబ కథా చిత్రంగా వస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను వచ్చే నెల 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news