స్వాతంత్య్రంపై అనుచిత వ్యాఖ్య‌లు..కంగానాపై హైద‌రాబాద్ లో కేసు న‌మోదు..!

బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ దేశ స్వాతంత్య్రం పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. 1947 లో దేశానికి వ‌చ్చిన స్వాతంత్య్రం అస‌లైంది కాద‌ని….2014 మోడీ ప్ర‌ధానమంత్రి అయ్యాక వ‌చ్చిన స్వాతంత్య్ర‌మే అస‌లైన స్వాతంత్య్రం అంటూ కంగానా వ్యాఖ్య‌లు చేసింది. కాగా ఈ వ్యాఖ్య‌లపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఇక తాజాగా కంగానా వ్యాఖ్య‌ల‌పై హైద‌రాబాద్ లో కేసు న‌మోదైంది. శివ‌శేన రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సుద‌ర్శన్ నార‌య‌ణగూడ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

అనంత‌రం సుద‌ర్శ‌న్ మాట్లాడుతూ….కంగానా ర‌నౌత్ భార‌తీయురాలు అయి ఉండి ఇలా మాట్లాడ‌టం స‌రికాద‌ని అన్నారు. కంగనా పిచ్చి కూత‌లు మానుకోవాల‌ని….ఆమెను వెంట‌నే పోలీసులు అరెస్ట్ చేయాల‌ని సుద‌ర్శ‌న్ డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఇటీవ‌ల కంగ‌నా ర‌నౌత్ కు ఇచ్చిన ప‌ద్మ‌శ్రీ అవార్డును కూడా వెన‌క్కి తీసుకోవాల‌ని సుద‌ర్శ‌న్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా కంగ‌నా చేసిన వ్యాఖ్య‌లను ప్ర‌తిప‌క్షాల‌న్నీ తిప్పికొడుతున్నాయి. దేశ స్వాంతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప‌నాయ‌కుల‌ను కంగనా అవ‌మానించింది అంటూ ఆరోపిస్తున్నారు.