నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్… భారీగా తగ్గుతున్న చికెన్ ధరలు.

-

 నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్. గత కొంత కాలంగా కొండెక్కి కూర్చున్న చికెన్ రేట్లు భారీగా తగ్గుతున్నాయి. సండే వచ్చిందంటే చాలు.. చాలా మంది ఇళ్లల్లో మసాలా గుమగుమలాడాల్సిందే. ముఖ్యంగా సండే రోజు అందరికి అందుబాటులో ఉండే చికెన్ కూర లేని ఇళ్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం చికెన్ రేట్లు చాలా వరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్తీక మాసం కావడంతో చాలా మంది భక్తులు నాన్ వేజ్ జోలికి పోరు. దీంతో సామాన్యుడికి ఎప్పుడు అందుబాటులో ఉండే చికెన్ రేట్లు తగ్గే అవకాశం కనిపిస్తోంది.chicken

కరోనా కారణంగా గతంలో ప్రజలు చికెన్‌ను విపరీతంగా తినేయడంతో ఒకానొక సమయంలో కిలో చికెన్‌ ధర ఏకంగా రూ. 300 వరకు చేరింది.అయితే ఇప్పుడు కార్తీక మాసంతో ధరలు ఒక్కసారిగా సగానికి సగం తగ్గాయి. దీంతో ప్రస్తుతం కిలో చికెన్‌ విత్‌ స్కిన్‌ రూ. 170, స్కిన్‌లెస్‌ రూ. 180కి పడిపోయింది. గడిచిన నాలుగు నెలల్లో కిలో చికెన్‌ ధర చేరుకున్న కనిష్ట ధర ఇదే కావడం విశేషం.
ఇదిలా ఉంటే కోళ్లు ఒక పరిమాణానికి వచ్చిన తర్వాత కచ్చితంగా వాటిని అమ్మేయాల్సిందే. లేదంటే వాటికి మేత ఎక్కువవడంతో పాటు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయి. దీంతో మార్కెట్లో డిమాండ్‌ తగ్గి, భారీగా కోళ్లు రావడంతో ఆటోమేటిగ్‌గా ధర తగ్గుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో అయితే చికెన్‌ ధరలు ఏకంగా 40 శాతం అమ్మకాలు తగ్గిపోయాయి. కార్తీక మాసం ముగిసే సమయానికి చికెన్ ధరలు ఇలాగే ఉండే అవకాశాలున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఒకవేళ ఈ సమయంలో ఉత్పత్తి తగ్గితే మళ్లీ కార్తీక మాసం ముగిసిన తర్వాత చికెన్ ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు కూడా లేకపోలేవు.

Read more RELATED
Recommended to you

Latest news