కంచ ఐలయ్య రాసిన ‘మనతత్వం’ పుస్తకంపై కేసు

-

ప్రముఖ రచయిత కంచ ఐలయ్య 2000 సంవత్సరంలో రాసిన ‘మనతత్వం’ పుస్తకంపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఐలయ్యకు ఇదివరకే కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో అక్టోబర్ 12వ తేదీన కరీంనగర్ ఎడిషనల్ సెషన్ కోర్టుకు ఆయన హాజరు కానున్నారు. అయితే ఈ పుస్తకం 1998-2000 సంవత్సరం వరకు ఓ ప్రముఖ వారపత్రికలో వరుసగా ప్రచూరింపబడింది. ఆ తర్వాత పుస్తకం ప్రింట్ చేయడం ప్రారంభించారు. ఈ పుస్తకం వెలువడినప్పటి నుంచి చర్చల్లో నిలిచింది.

కంచె ఐలయ్య
కంచె ఐలయ్య

తాజాగా బేతి మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఈ పుస్తకానికి వ్యతిరేకంగా కోర్టులో ఫిర్యాదు చేశాడు. తాను క్షత్రియుడినని చెప్పుకుని, ఈ పుస్తకంలో క్షత్రియులకు అవమానం జరిగిందని తెలిపాడు. అయితే ఈ పుస్తకం వెలువడి 22 ఏళ్లు దాటింది. ఇప్పుడు ఈ పుస్తకంపై కేసు నమోదు కావడం ప్రశ్నార్థకంగా మారింది. 2017లో కూడా ఐలయ్య రాసిన మరో పుస్తకంపై కేసు నమోదైంది. కోరుట్ల కోర్టుకు హాజరైన క్రమంలో రచయిత ఐలయ్యపై దాడులు కూడా జరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news