నెమలి సాలీళ్లు… ఆంధ్రాలోనే ఉంటాయట.. అందంగా ఉన్నాయి కదా పట్టుకుంటే అంతే..

-

సాలీడు గురించి మనకు తెలిసే ఉంటుంది.. కానీ నెమలి రంగు సాలీడు పేరు ఎప్పుడైనా విన్నారా.. ఇది చాలా అరుదైనట..అరుదైనది అంటే ఎక్కడో విదేశాల్లో ఉంటుంది అనుకుంటారేమో..మన ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇది కనిపిస్తుందట..ఇవి ఇప్పుడే అంతరించిపోయే దశకు చేరుకున్నాయి.. అత్యంత అరుదైన ఈ సాలీడులో ఏంటి స్పెషల్‌ చూద్దాం..!

తరంతులాని చూడగానే అమెరికన్లు కూడా భయపడతారు. ఎందుకంటే అవి నల్లగా… జూలుతో ఉంటాయి. అవి కదులుతుంటే.. భయంకరంగా ఉంటుంది. ఆ నల్ల రంగే భయపెడుతోంది. అవే సాలీళ్లు బ్లూ కలర్‌లో నెమలి రంగుల్లో ఉంటే… ఏమాత్రం భయం వెయ్యదు సరికదా… మనమే వాటిని పట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తాం. అందమైన సాలీళ్లు…

ఈ నెమలి సాలీడు శాస్త్రీయ పేరు పోసిలోథెరియా మెటల్లికా (Poecilotheria metallica). తరంతులా సాలీళ్లలో ఇవి ప్రాచీన జాతివి. ఇవి ఆంధ్రప్రదేశ్ లోని దట్టమైన అడవుల్లోనే ఉన్నాయట.. వీటిని అత్యంత వేగంగా అంతరించిపోతున్న జీవుల లిస్టులో చేర్చింది IUCN. అడవులు తగ్గిపోతుంటే.. మిగతా ప్రాణుల సంఖ్య తగ్గుతున్నట్లే.. వీటి సంఖ్య కూడా తగ్గిపోతోంది.

ఈ సాలీడుకి సంబంధించిన వీడియోని తాజాగా రెడ్డిట్‌ లోని Alarming-Plate-8266 యూజర్ పోస్ట్ చేశారు. ఈ వీడియోకి ఇప్పటికే 9 వేల మందికి పైగా అప్ ఓట్లు ఇచ్చారు.

విషపూరిత సాలీళ్లు :
ఈ సాలీళ్లలో ఆడ సాలీళ్లకు నీలి రంగు అలాగే ఉంటుంది. మగ సాలీళ్లు పెద్దవి అయ్యాక.. వాటికి నెమలి రంగు తగ్గిపోతుందట… ఆడ సాలీళ్లు 12 ఏళ్ల దాకా బతుకుతాయి. మగవి 4 ఏళ్ల దాకా జీవిస్తాయి. వీటి నెమలి పించం రంగు మెరుస్తూ అందంగా ఉంటుంది. అందుకే ఇవి బాగా ఆకర్షిస్తాయి. ఈ సాలీళ్లు కూడా విషపూరితమైనవే (venomous spider). కానీ ఇవి ఇప్పటివరకూ మనుషుల్ని చంపిన దాఖలాలు లేవు. వీటికి దగ్గరగా వెళ్తే కుట్టగలవు. వీటి విషం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది. అంతేకాదు.. తలనొప్పి, వాపు, తిమ్మిరి కలుగుతాయట..అందంగా ఉన్నాయి కదా అని ఆడుకుంటే మనకే చుక్కలు చూపిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news