ఏపీలో మూడు రాజధానులపై రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్
నరసింహారావు వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. అమరావతి రైతులను, రాష్ట్ర ప్రజలను వైసీపీ, టీడీపీ వంచిస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ కు చేస్తున్న మోసం గురించి జగన్, చంద్రబాబు ఎందుకు మాట్లాడరు….? అని జీవీఎల్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌తో ఉన్న లాలూచీ ఏమిటో వైసీపీ, టీడీపీ చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీలకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు జీవీఎల్. విశాఖ అభివృద్ధిపై టీడీపీ, వైసీపీ లు బహిరంగ వేదికపై చర్చకు రావాలని జీవీఎల్ అన్నారు. శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలు బయటపెట్టాలన్నారు జీవీఎల్.
టీడీపీ, వైసీపీ లకు వాటి స్వశక్తి పై నమ్మకం లేదని, బీజేపీతో వాళ్ళకేదో అవినాభావ సంబంధం ఉందంటూ స్టోరీ లను ప్రచారం చేస్తున్నారు అని జీవీఎల్ ధ్వజమెత్తారు. ఇవి తప్పుడు ప్రచారాలు మాత్రమేనని, ఈ రెండింటి కి ప్రత్యామ్నాయమే బీజేపీ అన్నారు జీవీఎల్.. ఇటు బీజేపీ నేత టీజీ వెంకటేశ్ వ్యాఖ్యలపై సోము వీర్రాజు స్పందించారు. టీజీ వెంకటేష్ ఆవేదనను పార్టీ అర్ధం చేసుకుందని, రాయలసీమ వెనకబాటుతనాన్ని అంగీకరిస్తామని, దాని అభివృద్ధి కి బీజేపీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారని జీవీఎల్ అన్నారు. వైసీపీ, టీడీపీలు నాగరాజ్, సర్పరాజ్ లు.. విశాఖ భూములపై ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, దశపల్ల భూముల విచారణకు ప్రత్యేక బృందం వేసి…. సుప్రీం కోర్టులో రివిజన్ పిటీషన్ వేయాలన్నారు.