బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు… కారణం ఇదే!

-

ఎమ్మెల్యేపోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి వెళ్లిన 12 మంది నాయకులపై పోలీసులు కేసు పెట్టారు.పోచారం ఇంటిదగ్గర బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం ఉస్మానియా అస్పత్రికి తరలించారు. తర్వాత వారిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు. పోచారం ఇంటికి ఈ రోజు(శుక్రవారం) ఉదయం వెళ్లారు. ఈ సమయంలో పోలీసుల భద్రత చర్యల వైఫల్యంపై ముఖ్యమంత్రి మండిపడ్డారు.

ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఉండగా అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు చొచ్చుకెళ్లారు. బాల్క సుమన్ సహా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేశారు. పదుల సంఖ్యలో పోచారం ఇంట్లోకి బీఆర్ఎస్ శ్రేణులు చొరబడ్డారు. కారు పార్టీ కార్యకర్తల ఆందోళనలతో పోచారం ఇంటి దగ్గర కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వెస్ట్ జోన్ డీఎస్పీ విజయ్ కుమార్ పోచారం ఇంటికెళ్లి విచారణ చేపట్టారు. బాల్క సుమన్ సహా బీఆర్ఎస్ నేతలపై తగిన చర్యలు ఉంటాయనివార్నింగ్ ఇచ్చారు. అలాగే పోచారం నివాసానికి ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఆఫీసర్ కూడా వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news