హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఉప ఎన్నిక తేదీ ఖరారు కావడంతో… అన్ని ప్రధాన పార్టీలు… గ్రామస్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. కరోనా మహమ్మారిని లెక్కచేయకుండా భారీ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తూ.. దూసుకుపోతున్నాయి పార్టీలు. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక బిజెపి పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ఊహించని షాక్ తగిలింది.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై హుజూరాబాద్ నియోజకవర్గం లో కేసు నమోదు అయ్యింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు అంటూ ఈటెల రాజేందర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా మహమ్మారి నిబంధనను ఉల్లంఘించి సభ పెట్టారంటూ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. కాగా హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఈనెల 30వ తేదీన జరుగనున్న సంగతి తెలిసిందే. టిఆర్ఎస్ పార్టీ తరఫున గెల్లు శ్రీనివాస్ బరిలో ఉండగా… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెంకట్ పోటీ చేస్తున్నారు.