బీసీల రిజర్వేషన్ అంశంలో తెలుగుదేశం పార్టీ వైయస్ జగన్ ప్రభుత్వాన్ని అనేక రీతులుగా ఇబ్బందులపాలు చేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85% రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికలకు జగన్ సర్కార్ ముందడుగు వేసిన తరుణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతాపరెడ్డి ద్వారా సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని హైకోర్టు లో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో హైకోర్టు 24% మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయని జగన్ సర్కార్ కి మొట్టికాయలు వెయ్యడం జరిగింది. ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే మీడియా అధినేతలు రామోజీ రాధాకృష్ణ మీడియా సంస్థలు గత కొన్ని రోజుల నుండి వైయస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా దారుణమైన రాతలు రాయడం జరిగింది. బీసీ ప్రజలను మోసం చేసే విధంగా వైయస్ జగన్ వ్యవహరించినట్లు హైకోర్టు తీర్పును గురించి మీడియాలో వార్తలు రావడం జరిగింది.
ఇటువంటి సందర్భంలో హైకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా బీసీలకు 34% రిజర్వేషన్ ప్రకారం సీట్లు ఇవ్వాలని సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో చంద్రబాబు మొదలుకుని టీడీపీ నేతల మైండ్ బ్లాక్ అయ్యింది. ఒక్కదెబ్బకు రెండు పిట్టలు పడ్డ చందంగా జగన్ దెబ్బకు టీడీపీ మరోసారి విలవిలలాడుతోంది. బాబు శోకానికి ఆంధ్రజ్యోతి, ఈనాడు శృతి కలిపాయి. తాము రాసినవే నిజాలని, తాము చెబితేనే లోకానికి వాస్తవాలు తెలుస్తాయనే భ్రమలోఆ రెండు పత్రికలు వ్యవహరించాయి. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు విషయంలో రామోజీ – రాధాకృష్ణ తమకు సంబంధించిన పత్రికలలో చెత్త రాతలు రాయడంతో ఇద్దరి మీద కేసులు వేయడానికి జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.