రోడ్డు ప్రమాద బాధితుల విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం?

-

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఒక కొత్త పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి సిద్ధమైంది. ప్రమాదంలో గాయాలపాలైన బాధితులకు తక్షణ సహాయం కింద రెండున్నర లక్షల రూపాయల వరకు నగదు రహిత చికిత్సా పథకాన్ని ప్రారంభించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.

జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ సహకారంతో కేంద్ర రోడ్లు, రహదారుల మంత్రిత్వశాఖ సొంత నిధులను వినియోగించి మోటారు వాహన ప్రమాద నిధిని ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది. రవాణా మంత్రిత్వ శాఖ చెబుతున్న వివరాల ప్రకారం దేశంలోని 21,000 కంటే ఎక్కువ ఆస్పత్రులకు బాధ్యతలు అప్పగించి మోటారు వాహన ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందేలా కేంద్రం చర్యలు చేపడుతోంది.

ప్రమాదాల బారిన పడిన వారిలో ఇన్సూరెన్స్ ఉన్న వాహనాల బాధితులకు అయ్యే ఖర్చును జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ భరించనుంది. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ఇన్సూరెన్స్ చేయని వాహనాల బాధితులకు సంబంధించిన ఖర్చులను భరించనుందని సమాచారం. 2019 సంవత్సరం సెప్టెంబర్ నెలలో మోటారు వెహికల్ సవరణ చట్టంలో రోడ్డు ప్రమాద నిధిని ఏర్పాటు చేయడానికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దాదాపు 13 కోట్ల కుటుంబాలకు కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news