రైతు చట్టాల రద్దుకు కర్త, కర్మ, క్రియ కేసీఆరే- ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాల రద్దుకు కర్త, కర్మ, క్రియ కేసీఆరే అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. చివరి రక్తపు బొట్టు వరకు రైతులకు మద్దతుగా నిలుస్తా అని వార్నింగ్ ఇవ్వడంతోనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. నల్ల చట్టాలను రద్దు చేయకుంటే నేనే రంగంలోకి దిగుతామని హెచ్చిరించడం కేంద్రాన్ని కదిలించిందని అన్నారు జీవన్ రెడ్డి. అన్నదాతలు చేస్తున్న ఉద్యమంతో కేంద్రం దిగివచ్చిందన్నారు. ఇప్పుడు రైతులు ఎవరి మెడలు వంచారో బండి సంజయ్ చెప్పాలని సెటైర్ వేశారు. రైతులను ఉద్దరించేందుకు అద్భుత చట్టాలకు కొంతమంది మూర్ఖులు అడ్డుపడుతున్నారని ఆనాడు బండి సంజయ్ అన్నారని.. ఇప్పుడు రైతుల ఉద్యమానకి కేంద్రమే తలవంచిందన్నారు.jeevan reddy

తమ డిమాండ్ల కోసం ధర్నా చేస్తున్న రైతులను టెర్రరిస్టులు, దళారులని ఎంపీ అరవింద్ అన్నారని గుర్తుచేశారు. రైతులతో పెట్టుకున్నవారు ఎవ్వరూ బాగుపడింది లేదన్నారు. రైతుల ఇన్ని రోజుల నుంచి ఉద్యమం చేస్తున్న ఏ ఒక్క రోజు కూడా కేంద్రం పట్టించుకోలేదని అన్నారు. కేసీఆర్ ఒక శక్తి అంటూ జీవన్ రెడ్డి పొగిడారు. 2009 నవంబర్ లో కేసీఆర్ దీక్ష చేసి తెలంగాణ ప్రకటన చేయించారని..ఇప్పుడు 2021 నవంబర్ లో దీక్ష చేసి నల్లచట్టాలను రద్దు చేయించారని అన్నారు.