లిక్క‌ర్ మాల్యాకు మూడింది.. ఏ క్ష‌ణంలో అయినా భార‌త్‌కు..!

వేల కోట్ల రూపాయ‌ల‌ను బ్యాంకుల‌కు ఎగ్గొట్టి విదేశాల‌కు పారిపోయిన లిక్క‌ర్ మాల్యాకు ఎట్ట‌కేల‌కు మూడింది. అత‌న్ని భార‌త్‌కు తీసుకొచ్చేందుకు అధికారులు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అత‌ను ఏ క్ష‌ణంలో అయినా భార‌త్‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు. ఇప్ప‌టికే మాల్యా అనేక సార్లు లండ‌న్ కోర్టులో ముంద‌స్తు బెయిల్ తెచ్చుకుని ప‌లు మార్లు త‌ప్పించుకున్నాడు. కానీ సీబీఐ, ఈడీ అధికారులు మరింత శ్ర‌మించారు. దీంతో బ్రిట‌న్ హైకోర్టు, సుప్రీం కోర్టుల‌లో మాల్యాకు చుక్కెదురైంది. ఇక ఇప్పుడు అత‌నికి ఉన్న అన్ని దారులూ మూసుకుపోగా.. ప్ర‌స్తుతం అన్ని వీలైనంత వేగంగా భార‌త్‌కు తీసుకువ‌చ్చేందుకు అధికారులు య‌త్నిస్తున్నారు.

cbi and ed may bring vijay mallya at any moment to india

కాగా మాల్యాను భార‌త్‌కు అప్ప‌గించేందుకు చేప‌ట్టాల్సిన న్యాయ ప్ర‌క్రియ కూడా పూర్త‌యింది. దీంతో మాల్యాను ఏ క్ష‌ణంలో అయినా భార‌త్‌కు తీసుకువ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. అయితే మాల్యాను గ‌నుక భార‌త్‌కు తీసుకువ‌స్తే ముందుగా అత‌న్ని సీబీఐ అదుపులోకి తీసుకుంటుంది. మొద‌ట వారే కేసు న‌మోదు చేశారు క‌నుక వారే అత‌న్ని అదుపులోకి తీసుకుని విచారిస్తారు.

ఇక మాల్యా కింగ్ ఫిష‌ర్ ఎయిర్‌లైన్స్ కోసం భార‌త్‌లోని బ్యాంకుల వ‌ద్ద మొత్తం రూ.9వేల కోట్ల‌కు పైగా రుణాలు తీసుకున్నాడు. ఇత‌నిపై మోసం, మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులు న‌మోద‌య్యాయి. ఎన్నో ఏళ్లుగా చ‌ట్టాల నుంచి త‌ప్పించుకుని తిరుగుతున్న ఇత‌న్ని ఎట్ట‌కేల‌కు భార‌త్‌కు తీసుకురానున్నారు.